ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: నూటికి 99 శాతం మంది రోజూ చేస్తున్న మిస్టేక్ ఇదే.. వీళ్లకు ఏం జరిగిందో చూస్తే మళ్లీ రిపీట్ చేయరేమో..!

ABN, First Publish Date - 2023-07-18T14:44:26+05:30

అందరూ కామన్ గా చేస్తున్న తప్పు గురించి అవగాహన కల్పిస్తూ ఢిల్లీ పోలీసులు ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా నవ్వు తెప్పించేదిగా ఉంది. అదే సమయంలో తప్పు చేస్తున్న వారికి ఇండైరెక్ట్ గా చురకలు అంటిస్తోంది..

తమదాకా వస్తే కానీ విషయం అర్థం కాదు చాలామందికి. ఏమవుతుందిలే అనుకుంటూనే తప్పు చేసేస్తుంటారు. ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఇంటా బయటా కూడా మొబైల్ ఉపయోగించడంలో పెద్ద మిస్టేక్స్ చేస్తున్నారు. అయితే ప్రజలను సరిదిద్దడం పోలీసుల కర్తవ్యం కదా.. అందుకే ఢిల్లీ పోలీసులు వినూత్న పద్దతి అవలంభించారు. అందరూ కామన్ గా చేస్తున్న ఈ తప్పు గురించి అవగాహన కల్పిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా నవ్వు తెప్పించేదిగా ఉంది. అదే సమయంలో తప్పు చేస్తున్న వారికి ఇండైరెక్ట్ గా చురకలు అంటించినట్టు కూడా ఉంది. ఈ వీడియో చూసిన తరువాత నెటిజన్లకు తాము చేస్తున్న తప్పేంటో అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు ఈ వీడియోకు జత చేసిన వాక్యాలు ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

బైక్ రైడింగ్(Bike riding) లో ఉన్నప్పుడు పోన్ కాల్స్ మాట్లాడటం, టెక్స్ట్ మెజేస్(Texting while bike riding) లు పంపడం వంటివి చాలా మంది చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతుంటాయి. ఇన్ని జరుగుతున్నా సమస్య తమదాకా రాలేదు కాబట్టి చాలామంది లైట్ గా తీసుకుంటారు ఈ విషయాన్ని. ఇలాంటి వాళ్లకు అవగాహన కల్పించడానికి ఢిల్లీ పోలీసులు(Delhi Police) నడుం బిగించారు. వీడియోలో వివిధ ప్రాంతాలలో, వివిధ సందర్బాలలో వ్యక్తులు మొబైల్ చాటింగ్ లోనూ(mobile chatting)లో మునిగిపోయి ఉన్నారు. వారు మొబైల్ లో మునిగిపోయి రహదారుల మీద, షాపింగ్ మాల్స్ లోనూ, పలు చోట్ల నడుచి వెళుతూ తమని తాము మరచిపోయారు. ఈ క్రమంలో కనీసం తమ ఎదురుగా ఉన్నదేంటి? అనే విషయం కూడా పట్టించుకోలేదు. కొందరు తమ ఎదురుగా ఉన్న స్తంబాలను ఢీకొంటే, మరికొందరు రహాదారుల మీద అక్కడక్కడా ఉన్నగోతుల దగ్గర వార్నింగ్ బోర్డ్ కూడా చూసుకోకుండా గోతులలో పడ్డారు. ఇంకొకరు షాపింగ్ మాల్ లో నడుస్తూ స్విమ్మింగ్ పూల్ లో పడ్డారు. ఇలా ఒకటా రెండా చాలా ఉన్నాయి. ఇవన్నీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అయితే ఈ వీడియో మొత్తం ముగిసిన తరువాత కొన్ని వాక్యాలు డిస్ల్పే అవుతాయి. 'టెక్స్ట్ పంపుతూ మీరు రహదారుల మీద సరిగ్గా నడవలేకున్నారు, అలాంటిది టెక్స్ట్ చేస్తూ బైక్ ఎలా డ్రైవ్ చేయగలరు?' అన్నది ఆ వాక్యాల సారాంశం.

Viral Video: నడిసముద్రంలో షాకింగ్ సీన్.. నీళ్లలో మునిగిపోతూ కనిపించిన గ్రద్ద.. ఆ తరువాత జరిగిందేంటో చూస్తే..


ఈ వీడియోను Delhi Police తమ ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'హే తమ్ముడు ఈ వీడియో ఒకసారి చూసి వెళ్ళు.. లేకపోతే వార్త అందరికీ చేరుతుంది, మీకు కాదు' అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఢిల్లీ పోలీసుల పనితనానికి ఫిదా అవుతున్నారు. 'చాలామంచి సలహా ఇచ్చారు. ప్రజలకు సరైన విధంగా అవగాహన కల్పిస్తున్నారు. నేను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఈ విషయంలో శ్రద్ద తీసుకుంటాను' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఓవరాల్ గా ఢిల్లీ పోలీసులు ప్రజల జీవితాల్లో మమేకం అవుతున్నారు, పోలీసులంటే ప్రజలకు భయం కాకుండా గౌరవం కలిగేలా ఉందింది' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఇదే విధంగా అవినీతిని అరికట్టడానికి కూడా మంచి సందేశంతో కూడిన వీడియో షేర్ చేయండి' అని ఇంకొందరు ఢిల్లీ పోలీసులను అభ్యర్థించారు.

Weight Loss Mistakes: బరువు తగ్గాలని ప్రయత్నించేవాళ్లు.. పొరపాటున కూడా ఈ 7 ఆహార పదార్థాలను పొద్దున్నే తినకండి..


Updated Date - 2023-07-18T14:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising