ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కృతజ్ఞత అనే పదానికి అసలు సిసలు అర్థమిదే కదా.. ఆహారాన్ని ఇస్తున్న వ్యక్తిని చూసి ఈ జింక ఏం చేసిందో చూస్తే..!

ABN, First Publish Date - 2023-10-06T16:00:05+05:30

కొన్ని పక్షులు, జంతువుల చేష్టలు చూస్తే ఇవి మనుషుల్లో పుట్టాల్సినవి పొరపాటున జంతుజాతిలో పుట్టాయేమో.. అని అనిపిస్తుంది. ఈ జింకను చూస్తే అదే అనిపిస్తుంది.

పిల్లలు కానీ, వయసులో ఉన్నవారు కానీ జంతుచేష్టలు చేస్తుంటే జంతువుల్లో పుట్టాల్సింది పొరపాటున మనిషివై పుట్టావు అని అంటూ ఉంటారు. అదే విధంగానే కొన్ని పక్షులు, జంతువుల చేష్టలు చూస్తే ఇవి మనుషుల్లో పుట్టాల్సినవి పొరపాటున జంతుజాతిలో పుట్టాయేమో.. అని అనిపిస్తుంది. వాటి తెలివి, అవి మనుషులను అర్థం చేసుకునే విధానం, పరిస్థితులకు తగ్గట్టు వాటి ప్రవర్తన అలా అనుకునేలా చేస్తాయి. ఈ జింకను చూస్తే అదే అనిపిస్తుంది. ఒక వ్యక్తి జింకకు ఆహారాన్ని ఇస్తోంటే ఆ జింక చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

జంతువులకు మనుషుల భాష అర్థమవుతుందో లేదో కానీ మనుషుల ప్రవర్తనను మాత్రం అవి చాలా బాగా అర్థం చేసుకుంటాయి. చిలుకలు, కుక్కలు, ఏనుగులు, పిల్లులు ఇలాంటివన్నీ చాలా తెలివితేటలు కలిగిన జంతువులే.. ఒక వీడియో ఈ విషయాన్ని నిరూపిస్తోంది. వీడియో జపాన్(Japan) కు చెందినది. వీడియోలో ఒక వ్యక్తి జింకకు(Deer) జపాన్ లో స్థానికంగా దొరికే ప్యాటీ అనే ఆహారాన్ని ఇస్తున్నాడు(Man given food to deer). అతను ప్యాటీని చేతిలో పట్టుకుని జింకకు ఇచ్చేముందు జపాన్ పద్దతిలో గౌరవంగా ఆ జింకకు తలవంచి నమస్కారం చేస్తాడు. అతనలా చేయగానే ఆ జింక కూడా తల వంచి అతనికి తిరిగి నమస్కారం చేసింది. అతను అదేవిధంగా మూడుసార్లు నమస్కారం చేయగా అది కూడా మూడు సార్లు నమస్కారం చేసింది. దీని తరువాత అతను ప్యాటీని జింకకు ఇవ్వకుండా చేతిని వెనక్కు తీసుకున్నాడు. కానీ ఆ జింక మాత్రం అతనికి గౌరవంగా మరొకసారి నమస్కరించి తనకు ఆహారం ఇవ్వమని అభ్యర్థించింది. దీంతో అతను జింకకు ఆహారం ఇచ్చాడు. అది అతని చేతి నుండి ప్యాటీని నోటితో అందుకుని హాయిగా తినేసింది. అతను ఎంతో సంతోషంగా చప్పట్లు కొట్టాడు. ఎంతో భూతదయ కలిగిన ఈ వీడియో నెటిజన్లను చాలా ఆకర్షిస్తోంది.

Maths Puzzle: ప్రభుత్వోద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే మీరు కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నట్టే లెక్క..!



ఈ వీడియోను unilad అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ జింక ప్రవర్తనకు ఫిదా అవుతున్నారు. 'జపాన్ లో జంతువులు మనుషుల్లా నాగరికతను అలవాటు చేసుకున్నాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'బౌద్దమతంలో జింకలను దేవదూతగా పరిగణిస్తారు' అని మరొకరు కామెంట్ చేశారు. 'జింకలకు కేకులు, బ్రెడ్డులు ఆహారంగా ఇస్తున్నారు' అంటూ అవి పచ్చికను, పండ్లను తినడాన్ని ఇంకొకరు గుర్తుచేశారు.

Mobile Charging: జెట్ స్పీడ్‌లో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ అవాలా..? ఈ 4 టిప్స్‌ను తూచా తప్పకుండా పాటిస్తే సరి..!


Updated Date - 2023-10-06T16:00:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising