ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకున్న ఈ వ్యక్తి.. ఇంగ్లీషులో ఇంత చక్కగా మాట్లాడుతున్నాడేంటా అని ఆరా తీస్తే..!

ABN, First Publish Date - 2023-08-24T14:20:22+05:30

ప్రతిరోజు వందల మంది టిఫిన్ బండ్లు పెట్టుకుని వేడి వేడి ఆహారం విక్రయిస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూనే.

గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో వీధివ్యాపారాలు పెరిగాయి. ఉదయం అల్పాహార సమయంలోనూ, సాయంత్రం స్నాక్స్ సమయంలోనూ ఎంతోమంది చిన్నా పెద్దా తేడా లేకుండా ఆహారం తయారుచేసి అమ్ముతూ డబ్బు సంపాదిస్తుంటారు. వీరిలో కొందరి గురించి తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఓ కుర్రాడు రహదారిలో వెళ్తోంటే ఇంగ్లీషులో అనర్గళంగా పబ్లిసిటీ ఇస్తూ మోమోస్ అమ్ముతున్న ఓ మధ్యవయసు వ్యక్తి కనిపించాడు. ఆయన దగ్గరకు వెళ్లి మోమోస్ కొంటూ విషయం ఆరా తీసిన కుర్రాడికి షాకింగ్ నిజం తెలిసింది. ప్రస్తుతం మోమోస్ అమ్ముతున్న ఈ వ్యక్తి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ప్రజలకు ఆహారం మీద ఆసక్తి పెరిగింది. కొత్తరుచుల కోసం ఎప్పుడూ తహతహలాడుతుంటారు. ఈ కారణంగానే రహదారుల మీద ప్రతిరోజు వందల మంది టిఫిన్ బండ్లు పెట్టుకుని వేడి వేడి ఆహారం అందిస్తుంటారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్ర రాజధాని లక్నో(Lucknow)లో ఓ ఆసక్తిక దృశ్యం కనిపించింది. లక్నోలోని రహదారికి ఒకవైపు ఒక మధ్యవయసు వ్యక్తి వేడివేడిగా మోమోస్(momos) అమ్ముతూ కనిపించాడు. 'ఈ మోమోస్ ఇంటిదగ్గర చాలా నీట్ గా తయారుచేసిన మోమోస్' అని ఇంగ్లీషులో అనర్గళంగా పబ్లిసిటీ చేసుకుంటూ అతను కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రహదారిలో వెళ్తున్న ఒక కుర్రాడు ఆ వ్యక్తి ఇంగ్లీష్ విని ఆశ్చర్యపోయాడు. ఆయన దగ్గరకు వెళ్లి ఒక ప్లేట్ మోమోస్ కొనుగోలు చేశాడు. ఈ సమయంలోనే ఆయనతో 'ఇంత బాగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నారు?' అని ప్రశ్నించాడు. తను ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేశానని ఆ వ్యక్తి చెప్పడంతో కుర్రాడు షాకయ్యాడు. రూ.100కు 10 మోమోస్ ను అమ్ముతున్నారు(English professor selling momos).ఇందులోకి బాదం చట్నీ, షెహజ్వాన్ సాస్ ఇస్తున్నారు.

Milk before Bed: రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటుందా..? లాభాలే కాదు.. ఈ నష్టాల గురించి కూడా తెలుసుకోండి..!



ఇంగ్లీష్ ప్రొఫెసర్ మోమోస్ అమ్ముతున్న వీడియోను lifewithdarpan అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'తరగతిలో టాపర్స్ అంటుంటాం కానీ చాలావరకు టాపర్స్ పరిస్థితి ఇలానే తయారవుతుంది' అని ఒకరు కామెంట్ చేశారు. 'చాలామంది ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు' అని మరొకరు అన్నారు. 'మోమోస్ చాలా బాగా తయారుచేశారు. పైపొర చాలా పలుచగా ఉంది' అని ఒకరు మోమోస్ క్వాలిటీని మెచ్చుకున్నారు. 'అతను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్నతనం అనుకోకుండా ఏదో ఒక పని చేస్తున్నాడు. కుదిరితే ఆర్థిక మద్దతు ఇవ్వండి. అంతేకానీ ఎగతాళిగా కామెంట్స్ చేయకండి' అని మరొకరు కామెంట్స్ చేసేవారికి చురకలు అంటించారు.

Health Facts: ప్రతిరోజూ అదే పనిగా తలనొప్పి వస్తోందా..? ఈ 9 అంశాలే అసలు కారణం కావచ్చు..

Updated Date - 2023-08-24T14:20:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising