Viral Video: ఈ పోలీసుకు ఇంత దూకుడెందుకు? ఇతనిపై ఫిర్యాదు చేస్తామంటూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్వీట్.. అతను చేసిన పనేంటో మీరే చూడండి..
ABN, First Publish Date - 2023-08-13T14:28:13+05:30
తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఈ పోలీసుకు ఇంత దూకుడా.. ఇతని గురించి రిపోర్ట్ చెయ్యాలి' అంటూ..
ప్రపంచ క్రికెట్ గతిని మార్చేసిన ప్లాట్ ఫామ్ ఐపియల్. ఐపియల్ ఆవిర్భవించింది మొదలు ఇప్పటిదాకా ఛాంపియన్ గా నిలబడిన వాటిలో ముంబై ఇండియన్స్ కూడా ఉంది. తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఈ పోలీసుకు ఇంత దూకుడా.. ఇతని గురించి రిపోర్ట్ చెయ్యాలి', అంటూ పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ ను మెన్షన్ చేసి మరీ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది ముంబై ఇండియన్స్. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. నిజమే ఇతని గురించి ఫిర్యాదు చెయ్యాలి అంటూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని సమర్థిస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జైపూర్ నగరంలో దుర్జన్ హర్సాని(Durjan Harsani) అనే పోలీసు అధికారి ఉన్నారు. ప్రముఖ ఐపియల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్(IPL Franchise Mumbai Indians) దుర్జన్ హర్సానికి సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. వీడియో జైపూర్ నగరంలోనిది. జైపూర్ లో ఓ క్రికెట్ అకాడమీలో కొంతమంది యువకులు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే సమయానికి దుర్జన్ హర్సానీ అక్కడ ఉన్నారు. క్రికెట్ పట్ల మక్కువ ఉన్న దుర్జన్ బాల్ పట్టి బౌలింగ్ చెయ్యడానికి సిద్దమయ్యడు. వీడియోలో దుర్జన్ హర్సానీ బౌలింగ్ చేయడం చూడొచ్చు. ఆయన బౌలింగ్ ప్రొఫెషనల్ బౌలర్ లాగే ఉంది. తన పేస్ బౌలింగ్(police officer pace bowling) తో కేవలం కొన్ని బాల్స్ బాల్స్ లోనే వికెట్ తీయడం చూడొచ్చు. ఇతని బౌలింగ్ స్కిల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రముఖ ఐపియల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ఈ వీడియో చూసి ఈ పోలీసాఫీసర్ బౌలింగ్ కు ఫిదా అయ్యింది. పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100 ను మెన్షన్ చేసి 'ఈ పోలీసాఫీసర్ వేగం గురించి పోలీసు హెల్ప్ లైన్ కేఫిర్యాదు చెయ్యాలి' అంటూ చమత్కారంగా పోస్ట్ పెట్టింది.
Papaya Seeds: అమ్మ బాబోయ్.. బొప్పాయి గింజలతో ఇన్ని లాభాలా..? తెలియక ఎన్ని సార్లు పారేసి ఉంటారో..!
ఈ వీడియోను Mumbai Indians తన ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేసింది. వీరి పోస్ట్, పోస్ట్ కు తగ్గ క్యాప్షన్, ఈ వీడియో మూడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 'అతను వృత్తి రీత్యా బౌలర్ కాదు కానీ, ప్రొఫెషనల్ బౌలర్ లానే బౌలింగ్ చేశాడు' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతనికి క్రికెట్ లో ఒక అవకాశం ఇవ్వండి' అని మరొకరు కామెంట్ చేశారు. 'క్రికెట్ నుండి ఒకమనిషిని దూరం చెయ్యచ్చు, కానీ మనిషిలో క్రికెట్ ట్యాలెంట్ ను తీసేయలేరు' అంటూ ఇంకొకరు ఎమోషన్ గా స్పందించారు.
Age vs Weight: మీ వయసెంత..? మీరు ఉన్న బరువెంత..? వయసుకు తగ్గ బరువే ఉన్నారా..? లేదో చెక్ చేసుకోండి..!
Updated Date - 2023-08-13T14:28:13+05:30 IST