Viral Video: ఏటీయం ను కొల్లగొట్టడానికి పక్కా ప్లాన్ వేసిన దొంగలు.. కారులో వచ్చి మరీ వీరు చేసిన నిర్వాకం చూస్తే..
ABN, First Publish Date - 2023-09-10T16:01:36+05:30
ఈ దొంగల ప్లాన్ కు ఇక డబ్బు పోవడం ఖాయం అనిపిస్తుంది కానీ అక్కడ జరిగింది చూస్తే..
ఈ తరం కుర్రాళ్లలో చాలామంది ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈ కారణంగానే చదువుకుంటున్న కుర్రాళ్లు, నిరుద్యోగులు చైన్ స్నాచర్లుగానూ, దొంగలు గానూ మారుతున్నారు. ఏటీయం మెషిన్లో బోలెడు డబ్బుంటుందనే కారణంతో కొంతమంది ఏటీయం లు కూడా కొల్లగొడుతుంటారు. ఇద్దరు దొంగలు కూడా అదే పనికి సిద్దమయ్యారు. వారిద్దరూ ఏటీయం మెషిన్ నుండి డబ్బు తీసేందుకు వింత పథకం వేశారు. వీళ్ల ప్లాన్ కు ఇక డబ్బు పోవడం ఖాయం అనిపిస్తుంది కానీ అక్కడ చోటు చేసుకున్నసంఘటన వేరుగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ దొంగల తెలివికి ఒకవైపు ఆశ్చర్యపోతూ.. మరొక వైపు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర(Maharashtra)లో ఇంతకుముందెవ్వరూ చూడని ఓ దొంగతనం చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాష్ట్రం, బీడ్ జిల్లాలో ఓ ప్రాంతంలో ఉన్న ఏటీయంను కొల్లగొట్టడానికి(ATM Robar) దొంగలు ప్రయత్నించారు. వీడియోలో ఇద్దరు దొంగలు తమ ముఖం కనిపించకుండా ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నారు. వీరిద్దరూ ఏటీయం లో డబ్బు దొంగిలించడానికి వింత పద్దతి అనుసరించారు. వీరిలో ఒక వ్యక్తి ఏటీయంను తాడుతో చాలా గట్టిగా కట్టేశాడు, రెండవ కొనను కారు వెనుక భాగంలో కట్టేశాడు. కారును స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనివ్వగానే ఏటీయం మెషిన్ బయటకు వచ్చేస్తుందని, తద్వారా దాన్ని ఎత్తుకెళ్లి నింపాదిగా అందులో డబ్బు తీసుకోవచ్చన్నది వారి ప్లాన్. అనుకున్నట్టే తాడుతో ఏటీయంను కట్టేసి, కారుకు తాడును బిగించిన తరువాత రెండవ దొంగ కారును స్టార్ట్ చేశాడు. కానీ ఏటీయం మెషిన్ ఉన్న గది డోర్ మూసుకుని ఉండటంతో ఆ రెండవ దొంగ మొదటి దొంగను తలుపు తీయమని చెప్పాడు. దీంతో రెండవ దొంగ ఏటీయం గది తలుపు తీసి అలాగే పట్టుకుని అక్కడే నిలబడ్డాడు. రెండవ దొంగ కారును స్పీడ్ గా ముందుకు పోనిచ్చాడు. అంతే.. ఏటీయం మెషిన్ చాలావేగంగా ముందుకు వచ్చి ఏటీయం గది తలుపును బద్దలు కొట్టింది. అక్కడే నిలబడి ఉన్న దొంగ ఆ విసురుకు అక్కడినుండి దూరంగా వెళ్లి పడ్డాడు. ఈ సంఘటన మొత్తం ఏటీయం గదిలో సెట్ చేసిన సీసీ కెమెరా(CC Camera)లో రికార్డయ్యింది.
Home Remedies For Loose Motion: ఎవరికీ చెప్పుకోలేని ‘విరేచనాల’ సమస్య.. ఈ 10 వంటింటి చిట్కాలను పాటిస్తే..!
ఏటీయంలో సేప్ఠీ సర్వీస్(ATM safety service) అమర్చి ఉండటంతో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఏటీయం ఉన్నచోటుకు చేరుకున్నారు. కానీ అప్పటికే ఆ దొంగలిద్దరూ అక్కడి నుండి ఉడాయించారు. వారు ఏటీయంలో డబ్బు దొంగిలించడంలో ఫెయిల్ అయ్యారు. సీసీ కెమెరాలో రికార్డ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోను Raja Babu అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేరే చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక వైపు ఆ దొంగల క్రియేటీవిటికి ఆశ్చర్యపోతూ మరొకవైపు పంచ్ లు సెటైర్లు వేస్తున్నారు. 'ఓహ్ కారులో వచ్చి ఏటీయం దొంగతనం చేయడం నేనెక్కడా వినలేదు. వీళ్లు బాగా డబ్బున్న దొంగలు' అని ఒకరు కామెంట్ చేశారు. 'బహుశా ఏటీయంను కారుతో ఇంటివరకు లాక్కెళ్ళి అక్కడ తీరిగ్గా డబ్బులు లెక్కించాలనుకున్నారేమో' అని మరొకరు కామెంట్ చేశారు. 'మీ అతి తెలివి తెల్లారిపోనూ..మీరెలా దొంగలయ్యార్రా' అని ఇంకొందరు అంటున్నారు.
Viral Video: వాహ్.. ఏం క్రియేటివిటీ బాస్.. కరెంట్ అక్కర్లేదు, చేత్తో ఉతకనక్కర్లేదు.. బట్టలు ఉతకడానికి సరికొత్త ఐడియా..
Updated Date - 2023-09-10T16:01:36+05:30 IST