నలుగురు భార్యలను వదిలేశాడు.. ఐదో భార్యను కూడా వదిలేస్తారని అనుకున్నారు.. కానీ ఓ రోజు రాత్రి.. ఆమె చేసిన పనితో..
ABN, First Publish Date - 2023-03-05T16:16:42+05:30
భార్యను బాగా చూసుకోవాల్సిన ఓ వ్యక్తి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు భార్యలను వదిలేశాడు. ఇటీవలే ఐదో వివాహం చేసుకున్నాడు. ఇప్పటికైనా..
భార్యను బాగా చూసుకోవాల్సిన ఓ వ్యక్తి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు భార్యలను వదిలేశాడు. ఇటీవలే ఐదో వివాహం చేసుకున్నాడు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాల్సిన అతను అలా చేయలేదు. దీంతో ఐదో భార్యను కూడా వదిలేస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఓ రోజు ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సింగ్రౌలి జిల్లా ఉర్తి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బీరేంద్ర గుర్జార్ అనే వ్యక్తి.. కొన్ని ఏళ్ల క్రితం మద్యం అలవాటు చేసుకున్నాడు. క్రమంగా మద్యానికి బానిస (Alcoholic) అయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యను హింసించేవాడు. కొన్నాళ్లు భరించిన ఆమె.. తర్వాత విసుగొచ్చి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత మరో మహిళను (woman) వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే చూసుకున్నాడు. తర్వాత యథావిధిగా తాగొచ్చి విసిగించేవాడు. కొన్ని నెలల తర్వాత ఆమెను చిత్రహింసలు (Torture) పెట్టి ఇంటి నుంచి గెంటేశాడు. ఇలా మొత్తం నలుగురు భార్యలను వదిలేశాడు. ఇటీవల కంచన్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఇప్పటికైనా తీరు మార్చుకుని భార్యను బాగా చూసుకోవాల్సిన బీరేంద్ర.. గతంలో మాదిరే తాగిచ్చి విసిగించేవాడు.
వీరి గొడవలు చూసిన వారంతా ఐదో భార్యను కూడా వెళ్లిపోవడమో, లేక వదిలేయడమో జరుగుతుందని అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 21 ఉదయం నుంచి ఫుల్‌గా తాగుతున్న బీరేంద్ర.. భార్య కంచన్‌ను చిత్రహింసలు పెట్టాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న కంచన్.. సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి భర్తకు నిద్రమాత్రలు ఇచ్చింది. దీంతో కాసేపటికి అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తర్వాత భర్తపై విచక్షణా రహితంగా దాడి (attack) హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని గుర్తపట్టకుండా దుస్తుల్లో చుట్టి.. నిర్మానుష్య ప్రదేశంలో పడేసింది. చివరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితురాలు కంచన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Updated Date - 2023-03-05T16:16:42+05:30 IST