ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Marriage: వధువు మెడలో దండ వేసి పారిపోయిన వరుడు.. చివరకు అర్ధరాత్రి తిరిగి వచ్చిన అతన్ని నిలదీయగా.. ఏం తెలిసిందంటే..

ABN, First Publish Date - 2023-06-25T18:10:52+05:30

ఇటీవల వివాహాలకు సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. కళ్యాణ మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి డాన్సులు, ప్రాంక్‌లు.. ఇలా ప్రతీదీ వీడియోల రూపంలో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల వివాహాలకు సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. కళ్యాణ మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి డాన్సులు, ప్రాంక్‌లు.. ఇలా ప్రతీదీ వీడియోల రూపంలో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. వధువు మెడలో దండ వేసిన తర్వాత వరుడు ఉన్నట్టుండి పారిపోయాడు. చివరకు అర్ధరాత్రి తిరిగి వచ్చిన అతన్ని నిలదీయగా.. ఏం తెలిసిందంటే..

బీహార్ (Bihar) భాగల్‌పూర్ జిల్లా ఇస్మాయిల్‌పూర్ పరిధి చౌదరి బసా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతికి (young woman) , పూర్నియా జిల్లా రూపాలి ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం (marriage) నిశ్చయమైంది. శనివారం పెళ్లి జరగాల్సి ఉండడంతో వరుడు తన కుటుంబ సభ్యులు, బంధువులతో వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా జయమాల కార్యక్రమానికి (Jayamala function) ఏర్పాట్లు ఘనంగా చేశారు. అతిథులందరి సమక్షంలో వధూవరులు ఇద్దరూ దండలు మార్చుకున్నారు. అనంతరం బంధువులంతా భోజనాలు చేస్తున్నారు. ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా అందరితో కలిసి ఉన్న వరుడు (groom) .. ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు.

Viral Video: చిరుత నుంచి తప్పించుకుని కారు వద్ద సేదతీరుతున్న జింక.. భయంతో చాలా సేపు ఎదురు చూసిన పులి.. చివరకు ఏమైందంటే..

దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. వరుడు పారిపోవడంతో భయపడ్డ అతడి బంధువులు కూడా వెళ్లిపోయారు. దీంతో అవాక్కైన వధువు బంధువులు.. వారిలో కొందరిని పట్టుకున్నారు. చివరకు పంచాయతీ గ్రామపెద్దలు, పోలీసుల వరకూ వెళ్లింది. చెప్పాపెట్టకుండా వరుడు ఇలా ఎందుకు వెళ్లాడో ఎవరికీ అర్థం కాలేదు. కొడుకు చేసిన పనికి అతడి తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు. ఎలాగైనా తన కొడుకును పిలిపించి పెళ్లి జరిపిస్తామని తండ్రి హామీ ఇవ్వడంతో గొడవ సర్దుమణిగింది. తర్వాత ఎట్టకేలకు అర్ధరాత్రి వరుడిని తీసుకొచ్చారు. వధువు ఇష్టం లేకే పారిపోయినట్లు అందరి ముందు అంగీకరించాడు. చివరకు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యథాతథంగా వారి వివాహం జరిగింది. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

Updated Date - 2023-06-25T18:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising