ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. తిరిగి రమ్మని ఫోన్ చేస్తే ఆమె సమాధానం విని నివ్వెరపోయిన భర్త..!

ABN, First Publish Date - 2023-03-11T17:25:11+05:30

వివాహానంతరం అత్తగారింట్లో అడుగుపెట్టిన నవ వధువును సాదరంగా ఆహ్వానించారు. భర్త, అత్తమామలతో ఆనందంగా ఉండడంతో త్వరగా కలిసిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఈ ఆనందం వారికి మూనాళ్ల ముచ్చటగా మారింది. వివాహమైన మూడో రోజే..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వివాహానంతరం అత్తగారింట్లో అడుగుపెట్టిన నవ వధువును సాదరంగా ఆహ్వానించారు. భర్త, అత్తమామలతో ఆనందంగా ఉండడంతో త్వరగా కలిసిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఈ ఆనందం వారికి మూనాళ్ల ముచ్చటగా మారింది. వివాహమైన మూడో రోజే నవ వధువు తన పుట్టింటికి వెళ్లింది. అయితే ఎంతకీ అత్తగారింటికి రాలేదు. దీంతో తిరిగి రమ్మంటూ భర్త ఆమెకు ఫోన్ చేశాడు. చివరకు అవతలి వైపు నుంచి సమాధానం విని నివ్వెరపోయాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

హర్యానాలోని (Haryana) జింద్ జిల్లా నర్వానా పరిధి భానా బ్రాహ్మణ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తికి దినేష్, మనీష్ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. వీరిలో పెద్ద కొడుకు దినేష్ మూడేళ్ల క్రితం మరణించాడు. చిన్న కొడుకు మనీష్ నర్వానాలోని ఓ వెల్డింగ్ షాపులో పని చేసేవాడు. ఈ క్రమంలో వీరి గ్రామనికి చెందిన సోను అనే వ్యక్తి.. మనీష్‌కు పెళ్లి సంబంధం (Marriage relationship) తీసుకొచ్చాడు. పంజాబ్ సంగ్రూర్‌కు చెందిన రింపి అనే యువతితో (young woman) మనీష్‌కు వివాహం నిశ్చయం చేశారు. పెళ్లి సంబంధం కుదిర్చినందుకు గాను మధ్యవర్తులు.. మనీష్ నుంచి రూ.2లక్షలు తీసుకున్నారు. నెల రోజుల క్రితం వివాహం చేసుకున్న మనీష్.. తన భార్యను సొంతూరికి తీసుకొచ్చాడు.

Marriage Photos: అయ్యబాబోయ్.. ఇలాంటి బంధువులు ఉంటే ఇక పెళ్లిళ్లు అయినట్టే.. వరుడికే చిర్రెత్తుకొచ్చి పెళ్లిని ఆపేసినంత పనిచేశాడు..!

అయితే పెళ్లయిన మూడు రోజులు నవ వధువు (new bride) ఎంతో సంతోషంగా గడిపింది. మూడో రోజు పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల తర్వాత మళ్లీ వచ్చింది. కానీ ఒక రోజు ఉండి అనంతరం మళ్లీ పుట్టింటికి వెళ్లింది. అయితే ఎన్ని రోజులు గడుస్తున్నా ఆమె రాకపోవడంతో.. పెళ్లి చేసిన మధ్యవర్తులను సంప్రదించాడు. వారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇటీవల భార్యకు ఫోన్ చేయగా.. ఇంటికి వచ్చేది లేదని, విసిగిస్తే కేసులు నమోదు చేయిస్తామని బెదిరించింది. దీంతో మనీష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రూ.8గంటల ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మనీష్ భార్యతో పాటూ మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Digital Payments in Wedding: పెళ్లి వేడుకలో QR Code బోర్డ్.. స్కాన్ చేసి ఓ బంధువు ఎంత పంపించాడో తెలిసి అవాక్కైన వధూవరులు..!

Updated Date - 2023-03-11T17:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising