కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime news: తల్లి ఉండగానే ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లిన యువకుడు.. బెడ్రూంలో ఫొటో తీసి మరీ అతడు చేసిన నిర్వాకం..

ABN, First Publish Date - 2023-09-24T19:15:19+05:30

ప్రేమ పేరుతో యువతులకు దగ్గరయ్యే యువకులు కొందరు.. చివరకు పెళ్లి పేరుతో మోసం చేస్తుంటారు. ఈ క్రమంలో తమ దారికి రాని పట్ల కొందరు ఎంతటి దారుణాలకు పాల్పడడానికైనా వెనుకాడరు. ఇంకొందరు మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. తాజాగా...

Crime news: తల్లి ఉండగానే ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లిన యువకుడు.. బెడ్రూంలో ఫొటో తీసి మరీ అతడు చేసిన నిర్వాకం..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ పేరుతో యువతులకు దగ్గరయ్యే యువకులు కొందరు.. చివరకు పెళ్లి పేరుతో మోసం చేస్తుంటారు. ఈ క్రమంలో తమ దారికి రాని పట్ల కొందరు ఎంతటి దారుణాలకు పాల్పడడానికైనా వెనుకాడరు. ఇంకొందరు మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. తాజాగా, పంజాబ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇంట్లో తన తల్లి ఉండగానే ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లాడు. బెడ్రూంలో ఫొటో తీసే క్రమంలో అతడు నిర్వాకంతో చివరకు ఏం జరిగిందంటే..

పంజాబ్ (Punjab) సదర్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన యువతికి.. ఇక్కడి ప్రాంతానికి చెందిన గంభీర్ అనే యువకుడితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. యువతిని (young woman) చూడగానే ఇష్టపడ్డ అతను.. క్రమక్రమంగా ఆమెకు దగ్గరయ్యేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించాడు. చివరకు ఆమెకూ నచ్చడంతో ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. ‘‘త్వరలో ఇంగ్లండ్ వెళ్తున్నాను.. తర్వాత పెళ్లి చేసుకుని నిన్నూ ఇంగ్లండ్ తీసుకెళ్తా’’ అని చెప్పడంతో అతన్ని ఎంతో నమ్మింది. ఈ క్రమంలో ఓ రోజు ప్రియురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో గంభీర్ తల్లి కూడా ఇంట్లోనే ఉంది. తన బెడ్రూంలోకి తీసుకెళ్లిన గంభీర్.. ఆమెకు ఫొటోలు తీసే క్రమంలో ఏవేవో మాయమాటలు చెప్పి (Indecent behavior on a young woman) చివరకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని తరచూ చెప్పడంతో ఆమె కూడా నమ్మింది. ఇలా తరచూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు.

Viral Video: వామ్మో! ఈ టీచర్ రూటే సపరేటు.. పాఠాలు చెప్పాల్సింది పోయి.. ఏకంగా క్లాస్ రూంలోనే..

తర్వాత ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. కొన్నాళ్ల తర్వాత ప్రియురాలికి ఫోన్ చేసి, తాను ఇంగ్లండ్‌లో ఉన్నానని.. అక్కడి నుంచి అమెరికా వెళ్లాలని, అందుకోసం కొంత మొత్తం కావాలని అడిగాడు. అయితే యువతి కుటుంబ సభ్యులు డబ్బులు వేయకపోవడంతో గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రియురాలితో కలిసి ఉన్న సందర్భంలో తీసిన వీడియోలను నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసి, అందులో పోస్టు చేశాడు. వీడియోలు వైరల్ అవడంతో యువతి షాక్ అయింది. చివరకు తన తల్లిదండ్రులతో కలిసి గంభీర్ ఇంటికి వెళ్లింది. వీడియోలు తీసేయాలని గంభీర్ తల్లిదండ్రులను కూడా వేడుకున్నాడు. అయితే వారు కూడా కొడుకు వైపే మాట్లాడారు. అంతటితో ఆగకుండా డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను తెలిసిన వారికి పంపిస్తామంటూ బెదిరించారు. దీంతో వారు చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు పోలీసులు.. గంభీర్, అతడి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: పాములతో జాగ్రత్తగా ఉండాలనేది ఇందుకే.. బైక్‌లో వెళ్తున్న ఈ యువకుడు ఎలా చనిపోయాడో చూస్తే..

Updated Date - 2023-09-24T19:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising