Viral Video: యమా స్పీడుగా వెళ్తున్న కారు.. సడన్‌గా ఊడిన పక్క కారు టైర్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-03-28T17:48:55+05:30
రోడ్డు ప్రమాదాలు కొన్నిసార్లు ఊహించని విధంగా జరుగుతుంటాయి. అధిక వేగం వల్ల కొన్ని, అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం వల్ల మరికొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్ని సార్లు ఒకరి నిర్లక్ష్యం మరొకరి ప్రాణాల మీదకు వస్తుంటుంది. తాజాగా..
రోడ్డు ప్రమాదాలు కొన్నిసార్లు ఊహించని విధంగా జరుగుతుంటాయి. అధిక వేగం వల్ల కొన్ని, అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం వల్ల మరికొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్ని సార్లు ఒకరి నిర్లక్ష్యం మరొకరి ప్రాణాల మీదకు వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. రెండు కార్లు చాలా స్పీడ్‌గా వెళ్తుంటాయి. సడన్‌గా పక్క కారు టైరు ఊడిపోతుంది. దీంతో చివరకు ఏం జరిగిందంటే..
అమెరికాలోని (America) ఓ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. రహదారిపై చాలా వాహనాలు వేగంగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఓ కారులోని వ్యక్తి వీడియో ఆన్ చేసి రికార్డు (Video record) చేస్తూ వెళ్తుంటాడు. ఈ క్రమంలో అతడి కారును ఓ నల్ల కారు ఓవర్‌టేక్ చేసి వెళ్తుంది. చూస్తుండగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. నల్ల కారు (Black car) పక్కనే ఓ మినీ తెల్ల ట్రక్ కారు కూడా అత్యంత వేగంతో వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలో తెల్ల కారు (white car) టైరు ఒక్కసారిగా ఊడి పక్కకు వస్తుంది. పక్కకు వచ్చిన ఎదరుగా రావడంతో.. నల్ల కారు దాన్ని ఢీకొని గాల్లోకి లేస్తుంది. గాల్లోనే పల్టీలు (car accident) కొడుతూ రోడ్డుపై ఈడ్చుకుంటూ ముందుకు వెళ్తుంది.
Funny Video: ఏమీ చదవకుండానే ఐఏఎస్ అవడం ఎలా..?.. ఈ ప్రశ్నకు ఈ యువతి ఇచ్చిన సమాధానమేంటో వింటే..
టైరు ఊడిన కారు అలాగే ముందుకు వెళ్లి రోడ్డు పక్కన ఆగిపోతుంది. ఈ ప్రమాదంలో నల్ల కారు నుజ్జునుజ్జవుతుంది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ క్షేమంగా బయటపడినట్లు తెలిసింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. హాలీవుడ్ చిత్రాల్లోని (Hollywood films) సీన్లను తలదన్నేలా ఉందని.. కొందరు, డ్రైవర్ క్షేమంగా బయటపడడం సంతోషకరం.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-03-28T17:48:55+05:30 IST