ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Train Journy పొరపాటున ఓ యువతి కాలును తొక్కాడో 25 ఏళ్ల కుర్రాడు.. చివరకు ఇలా ఎక్కాల్సొచ్చింది.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2023-02-18T15:40:57+05:30

రైలు, బస్సు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రధానంగా రైలు ప్రయాణంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాం. త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో ఎంత రద్దీ ఉన్నా.. ఎలాగోలా ఇరుక్కుని మరీ ప్రయాణం చేస్తుంటారు. అయితే..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైలు, బస్సు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రధానంగా రైలు ప్రయాణంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాం. త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో ఎంత రద్దీ ఉన్నా.. ఎలాగోలా ఇరుక్కుని మరీ ప్రయాణం చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రత్యేకంగా మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రైలు ప్రయాణ సమయంలో ఓ యువకుడు పొరపాటున ఓ యువతి కాలు తొక్కాడు. అంతే, తర్వాత బోగీలో రచ్చరచ్చ చేసిందా యువతి.. చివరకు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఉన్నావ్ పరిధి దహీ పోలీస్ స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Super Fast Express) రైలు.. సిగ్నల్ లేకపోవడంతో, రైల్వే క్రాసింగ్ వద్దకు రాగానే ఆగిపోయింది. ఆగిన వెంటనే ఓ 25 ఏళ్ల యువకుడు (young man).. బోగీ నుంచి వేగంగా కిందకు దిగి, పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని (High tension electric pole) ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ రచ్చ రచ్చ చేశాడు. దీంతో రైల్లోని ప్రయాణికులంతా అక్కడ గుమికూడారు. ఏం జరుగుతుందో వారికి ఏమాత్రం అర్థం కాలేదు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యువకుడికి నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నించారు. అయినా సదరు యువకుడు మాత్రం వినిపించుకోలేదు. చివరకు ఎలాగోలా అతడికి నచ్చజెప్పి, కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చేయమన్నదొకటి.. చేసిన ఆపరేషన్ మరొకటి.. డాక్టర్ల నిర్వాకమిదీ.. పెళ్లికి పనికి రాకుండా చేశారంటూ కేసు పెట్టిన యువకుడు..!

విచారించగా అతడు చెప్పింది విని అంతా అవాక్కయ్యారు. రైలు ప్రయాణ సమయంలో సదరు యువకుడు.. చూసుకోకుండా ఓ యువతి (young woman) కాలును తొక్కాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన యువతి.. అతడిని ఇష్టమొచ్చినట్లు తిట్టేసింది. అంతటితో ఆగకుండా పెద్ద గొడవ చేయడంతో పక్కన ఉన్న ప్రయాణికులంతా యువకుడిపై దాడి (Passenger attack on youth) చేశారు. దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులకు తెలియజేశాడు. సమస్య విన్న పోలీసులు.. యువకుడిని సముదాయించి, బస్సు ఎక్కించి ఇంటికి పంపించారు. కాగా, యువకుడి ఆత్మహత్యయత్నానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి.

అత్తారింటికి వెళ్తూ సడన్‌గా కారును ఆపమన్న నవ వధువు.. చెట్ల పొదల్లోకి వెళ్లి ఎంతకూ రాకపోవడంతో వరుడు కూడా వెళ్లి చూస్తే..

Updated Date - 2023-02-18T15:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising