Gambling: భార్యను పందెం కాసి జూదం ఆడాడు.. చివరకు జరగకూడని ఘోరం జరిగిపోయింది..!
ABN, First Publish Date - 2023-05-20T21:36:27+05:30
మద్యానికి అలవాటు పడ్డ వారు ఏం చేస్తున్నారో వారికే తెలీనంత స్థితిలోకి వెళ్లిపోతుంటారు. మద్యం మత్తులో కొందరు వయసు, వరసలు చూసుకోకుండా దారుణాలకు తెగబడుతుంటే.. మరికొందరు కుటుంబ సభ్యులపై కూడా దాడులకు తెగబడుతుంటారు. ఇలాంటి ..
మద్యానికి అలవాటు పడ్డ వారు ఏం చేస్తున్నారో వారికే తెలీనంత స్థితిలోకి వెళ్లిపోతుంటారు. మద్యం మత్తులో కొందరు వయసు, వరసలు చూసుకోకుండా దారుణాలకు తెగబడుతుంటే.. మరికొందరు కుటుంబ సభ్యులపై కూడా దాడులకు తెగబడుతుంటారు. ఇలాంటి ఘటనలు మన చుట్టూ తరచూ ఏదో ఒక సందర్భంలో చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి స్నేహితుడితో కలిసి జూదం ఆడాడు. డబ్బులు మొత్తం పోవడంతో భార్యను కూడా పందెం కాసి ఆడాడు. చివరకు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్ పరిధి ఈస్ట్ అహ్మద్‌నగర్ లిసాడి గేట్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన గోపి (పేరు మార్చాం) అనే వ్యక్తి.. భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి 12ఏళ్ల క్రితం వివాహమైంది. గోపీ మొదట్లో భార్యను ఎంతో బాగా చూసుకునేవాడు. అయితే తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. మద్యానికి బానిసై (Alcoholic) సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు చేశాడు. చివరకు ఇంట్లోని వస్తువులు కూడా అమ్మేసి మందు తాగేవాడు. అయినా అతడి భార్య భరిస్తూ వచ్చింది. ఏదో ఒక రోజు తెలుసుకుని మారతాడులే అనుకుంటూ తనకు తాను సర్దిచెప్పుకొంటూ వచ్చింది. అయితే ఇటీవల గోపీ మరింత దారుణంగా తయారయ్యాడు. మద్యానికి తోడు స్నేహితులతో జూదం అడడం కూడా అలవాటు చేసుకున్నాడు.
ఓ రోజు స్నేహితుడితో కలిసి జూదం (gambling) ఆడి డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు. పోయిన డబ్బులు ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో చివరకు తన భార్యను కూడా పందెం కాసి జూదం ఆడాడు. చివరకు ఓడిపోవడంతో ఫుల్‌గా మందు తాగి రాత్రి ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం భార్యకు చెప్పి.. స్నేహితుడి వద్దకు వెళ్లాలంటూ ఒత్తిడి తెచ్చాడు. భర్త మాటలకు ఆమెకు మతిపోయింది. ‘‘జూదం ఆడటం ఏంటీ.. నన్ను పందెం కాయడం ఏంటీ.. నువ్వు మనిషివా కాదా’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా గోపీ మాత్రం వినిపించుకోకుండా భార్యను బలవంతం చేశాడు. దీంతో ఎలాగోలా అతడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎలాటి కేసూ నమోదు కాలేదు. చివరకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-05-20T21:36:27+05:30 IST