ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీ కేసులో జైల్లో ఉన్న భర్త.. లాయర్ పిలవడంతో కారు ఎక్కిన భార్య.. మార్గ మధ్యలో ఎవరూ ఊహించని విధంగా..

ABN, First Publish Date - 2023-03-07T20:35:24+05:30

భార్య ఇబ్బందులను భర్త పట్టించుకుంటాడో లేదో తెలీదు గానీ.. భర్త కష్టాల్లో ఉంటే ఏ భార్యా భరించలేదు. అవసరమైతే ప్రాణాలు ఇచ్చైనా భర్తను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి మహిళల గురించి మనం రోజూ ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భార్య ఇబ్బందులను భర్త పట్టించుకుంటాడో లేదో తెలీదు గానీ.. భర్త కష్టాల్లో ఉంటే ఏ భార్యా భరించలేదు. అవసరమైతే ప్రాణాలు ఇచ్చైనా భర్తను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి మహిళల గురించి మనం రోజూ ఎక్కడో చోట వింటూనే ఉంటాం. మధ్యప్రదేశ్‌లో తాజాగా ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చోరీ కేసులో భర్త జైల్లో ఉండడంతో భార్య తల్లడిల్లిపోయింది. ఈ క్రమంలో ఓ లాయర్ బెయిల్ ఇప్పిస్తానని చెప్పడడంతో ధైర్యం తెచ్చుకుంది. అయితే అతడితో పాటూ కారులో వెళ్తుండగా.. మార్గ మధ్యలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Madhya Pradesh CM Shivraj Singh Chouhan) సొంత జిల్లా సెహోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బుద్ని పరిధికి చెందిన ఓ వ్యక్తి చోరీ కేసులో (theft case) హోషంగాబాద్ జైల్లో ఉన్నాడు. దీంతో అతడి భార్య చాలా రోజులుగా బెయిల్ (Bail) కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయినా భర్తను మాత్రం బయటకు తీసుకురాలేకపోయింది. ఈ క్రమంలో సమస్య తెలుసుకున్న సలీంఖాన్ అలియాస్ బల్లు అనే లాయర్ (Lawyer) .. సదరు మహిళను సంప్రదించాడు. ‘‘మీరేం భయపడొద్దు.. మీ భర్తను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది’’.. అని ధైర్యం చెప్పాడు. దీంతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. త్వరగా తన భర్తను విడిపించమని ప్రాథేయపడింది. రెండు రోజుల తర్వాత సదరు లాయర్.. మహిళకు ఫోన్ చేశాడు.

Viral Video: కోటి మందికి పైగా చూసిన వీడియో.. లక్షల కొద్దీ లైకులు.. ఇంతకీ ఈ బురద నీళ్లల్లో ఇతడేం చేస్తున్నాడంటే..

బెయిల్ పని మీద బర్ఖెడా వెళ్లాలని చెప్పాడు. దీంతో వెంటనే ఆమె అతడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడికి రాగానే లాయర్ తన కారులో ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో మిడ్‌ఘాట్ వద్ద కారు ఆపాడు. దీంతో కారులో ఉన్న మహిళ ఒక్కసారిగా కంగారు పడింది. కొద్ది సేపటి తర్వాత అక్కడికి లాయర్ స్నేహితులు ఇద్దరు వచ్చారు. అంతా కలిసి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె నోరు మూసి సామూహిక అత్యాచారం (Indecent behavior) చేశారు. వద్దని వేడకుంటున్నా కనికరించకుండా పాశవికంగా ప్రవర్తించారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. చివరకు ఎలాగోలా పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం మహిళను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షాపులో బంగారు నగలు మిస్సింగ్.. నిలదీస్తే నాకేం తెలీదన్న యజమాని కొడుకు.. అనుమానంతో సీసీ కెమెరాలను చెక్ చేస్తే..

Updated Date - 2023-03-07T20:40:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising