Train journey: సినిమాను తలపించే సీన్లు.. రైల్లోని బాత్రూంలో దాక్కున్న యువతి.. వెతుక్కుంటూ వచ్చిన రైల్వే పోలీసులు.. అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-04-08T17:08:20+05:30
మహిళపై కన్నేసే విలన్లు.. ఎాగైనా దారికి తెచ్చుకోవాలని చూస్తుంటారు. ఇందుకోసం చివరకు ఎంతకు తెగించడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలో వారు చేసే దారుణాల నుంచి యువతులను హీరో వచ్చి కాపాడుతుంటాడు. ఇలాంటి సీన్లు కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే..
మహిళపై కన్నేసే విలన్లు.. ఎాగైనా దారికి తెచ్చుకోవాలని చూస్తుంటారు. ఇందుకోసం చివరకు ఎంతకు తెగించడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలో వారు చేసే దారుణాల నుంచి యువతులను హీరో వచ్చి కాపాడుతుంటాడు. ఇలాంటి సీన్లు కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఈ సీన్లను తలదన్నే ఘటనలు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ యువతి రైల్లోని బాత్రూంలో దాక్కోవడంతో పోలీసులు వెతుక్కుంటూ వచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్‌లోని (Rajasthan) జోధ్‌పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇటాలియన్ యువతి (Italian woman) తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇటీవల జైసల్మేర్‌ను (Jaisalmer) సందర్శించడానికి వచ్చింది. ఇందుకోసం జోధ్‌పూర్‌లో రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్ (Ranikhet Express) రైలు ఎక్కారు. కదులుతున్న రైల్లో నుంచి బయటి దృశ్యాలను చూస్తూ సరదాగా గడుపుతున్నారు. ఈ సమయంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. సదరు కోచ్ అటెండర్ అయిన గుప్త అనే వ్యక్తి మొదటి నుంచీ యువతిని గమనిస్తూ ఉన్నాడు. ఎలాగైనా ఆమెను దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో చీకటి పడగానే కదులుతున్న రైల్లో ఆమె వద్దకు వెళ్లి అసభ్యకరంగా (Indecent behavior on young woman) ప్రవర్తించాడు. కాసేపు ఓర్పుగా భరించిన ఆమె.. అలాగే చేస్తుండడంతో తీవ్రంగా ప్రతిఘటించింది.
దీంతో అతడికి కోపం వచ్చి మరింత రెచ్చిపోయాడు. చివరకు దాడికి (Assault on young woman) పాల్పడడంతో భయపడిపోయిన ఆమె.. పరుగెత్తుకుంటూ వెళ్లి బాత్‌రూంలో (Train toilet) దాక్కుంది. తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. వారు జరిగిన ఘటనపై రైల్వే మంత్రితో (Minister of Railways) పాటూ పోలీసులకూ సందేశం పంపించారు. దీంతో వెంటనే స్పందించిన జోధ్‌పూర్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది.. బాత్‌రూంలో ఉన్న యువతి రక్షించారు. అనంతరం వారిని జైసల్మేర్‌కు సురక్షితంగా పంపించారు. అయితే నిందితుడిపై కేసు పెట్టేందుకు ఇటాలియన్ మహిళ నిరాకరించింది. చివరకు శాంతిభద్రతలకు విఘాతం, తదితర సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-04-08T17:22:04+05:30 IST