WhatsApp: ఫ్యామిలీ వాట్సప్ గ్రూపులో అలాంటి ఫొటో పెట్టావేంటి..? వెంటనే డిలీట్ చెయ్.. అంటూ అక్క మెసేజ్.. తమ్ముడు చేసిన మిస్టేక్‌తో..
ABN, First Publish Date - 2023-05-31T19:23:03+05:30
ఓ కుర్రాడు పొరపాటున చేసిన పని పెద్ద తలనొప్పికి దారితీసింది. అతను ఓ ఫోటోను స్నేహితుడికి పంపబోయి ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టేశాడు. అది చూడగానే ఆ కుర్రాడి అక్క అగమేఘాల మీద కుర్రాడిని అలెర్ట్ చేసింది. కానీ..
సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేసేటప్పుడు అనుకోకుండా పొరపాట్లు జరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఎక్కువ మంది భారతీయులు ఉపయోగిస్తున్న ఛాటింగ్ యాప్ ఏదంటే టక్కున వాట్సప్ పేరు చెప్పేయచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ లు ఏర్పాటు చేసుకుని నిరంతరం టచ్ లో ఉంటారు. వాట్సప్ ఉపయోగించే ఓ కుర్రాడు పొరపాటున చేసిన పని పెద్ద తలనొప్పికి దారితీసింది. అతను ఓ ఫోటోను స్నేహితుడికి పంపబోయి ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టేశాడు. అది చూడగానే ఆ కుర్రాడి అక్క అగమేఘాల మీద కుర్రాడిని అలెర్ట్ చేసింది. 'నువ్వు ఫ్యామిలీ గ్రూప్ లో అలాంటి ఫోటో పెట్టావేంటి..? వెంటనే డిలీట్ చెయ్..' అంటూ చిటపటలాడింది. అయితే కుర్రాడి దరిద్రం నెత్తిన కూర్చున్నట్టు అతను ఫోటో డిలీట్ చేయడానికి ప్రయత్నించి మరొక పొరపాటు చేశాడు. తప్పు మీద తప్పు జరగిపోయి నిండా చిక్కుల్లో మునిగిపోయాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతోంది. ఈ వార్త విన్నవారు 'ఆ కుర్రాడు ఇంకా బ్రతికే ఉన్నాడా?' అంటున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు పెట్టిన ఫోటోలో అంత అభ్యంతకరమైన విషయం ఏముంది? ఆ కుర్రాడు చేసిన పొరపాటు ఏంటి పూర్తీగా తెలుసుకుంటే..
ఇప్పట్లో ఉద్యోగాల కారణంగా రాష్ట్రాలు, దేశాలు దాటి వెళుతున్నవారు ఉన్నారు. ఎవరెంతదూరంలో ఉన్నా సోషల్ మీడియా పుణ్యమా అని అందరూ టచ్ లో ఉంటున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కలసి వాట్సప్ గ్రూప్(WhatsApp group) ఏర్పాటు చేసుకుని రోజువారీ కబుర్లు చెప్పుకోవడం ఇప్పట్లో కామన్. క్రికెట్ పిచ్చి అధికంగా ఉన్న ఓ కుర్రాడు ఐపియల్(Watching IPL match) మ్యాచుల సమయంలో ముంబై ఇండియన్స్ కు సపోర్ట్ గా(Mumbai Indians fan) ఉన్నాడు. అతను బీర్(Beer) తాగుతూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి తన సంతోషాన్ని తన స్నేహితునితో షేర్ చేసుకోవాలని అనిపించింది. దాంతో అతను వెంటనే బీర్ క్యాన్ ఫోటో తీసి వాట్సప్ లో షేర్(Beer can share in WhatsApp) చేసి 'ముంబై గెలుపు కోసం'(Mumbai for the win) అని ఓ మెసేజ్ కూడా పెట్టాడు. అయితే ఆ కుర్రాడు మ్యాచ్ చూస్తూ బీర్ తాగుతున్న జోష్ లో తన స్నేహితునికి పెట్టబోయి బీర్ క్యాన్ ను, దానికి జతగా పెట్టిన మెసేజ్ ను ఫ్యామిలీ గ్రూపులో(Sharing beer photo in family WhatsApp group) పెట్టాడు. అది ఆ కుర్రాడి తల్లిదండ్రులు చూడనే చూశారు. 'ఏంటి??' అని ఆ కుర్రాడి తండ్రి గ్రూపులోనే మెసేజ్ పెట్టాడు. 'నువ్వు బీర్ తాగుతావా?' అని ఆ కుర్రాడి తల్లి కూడా గ్రూపులోనే మెసేజ్ పెట్టింది. కానీ అతను వాటిని గమనించుకోలేదు. మ్యాచ్ చూడటంలో మునిగిపోయాడు. అతనలా మ్యాచ్ చూస్తుండగా అతనికి తన అక్క నుండి పర్సనల్ మెసేజ్ వచ్చింది. 'ఒరేయ్ తమ్ముడు నువ్వు ఫ్యామిలీ గ్రూప్ లో అలాంటి ఫోటో పెట్టావేంటి? వెంటనే డిలీట్ చెయ్యి..' అని చిటపటలాడింది.
Viral Video: టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నాడో వృద్ధుడు.. ఓ కుర్రాడు తన వైపే రావడం చూసి కంగారు.. ట్యాబ్‌లో అతడు చూపించిన ఫొటోను చూసి..!
అక్క పెట్టిన మెసేజ్ చూసుకోగానే అతను ఖంగుతిన్నాడు. ఫ్రెండుకు పెట్టబోయి తను చేసిన పొరపాటు ఏంటో అతనికి అర్థం అయింది. అతను వెంటనే ఫ్యామిలీ గ్రూపు ఓపెన్ చేసి తను పెట్టిన ఫోటో డిలీట్ చేయబోయాడు. కానీ అతని దురదృష్టం కొద్దీ అతను డిలీట్ ఫర్ ఎవెరీవన్ చెయ్యబోయి డిలీట్ ఫర్ మీ(make delete for me instead delete for every one) ఆప్షన్ కొట్టేశాడు. దీంతో ఫోటో అతను డిలీట్ చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అదే విషయాన్ని ఆ కుర్రాడు తన అక్కతో చెప్పగా 'ఇక నీ పని అయిపోయిందిపో..' అని ఓ రిప్లయ్ ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. Saniya Dhawan అనే ఆ కుర్రాడి అక్క స్క్రీన్ షాట్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ స్క్రీన్ షాట్స్ చూసిన నెటిజన్లు కుర్రాడి గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు. 'ఆ కుర్రాడు తన ఫ్యామిలీకి పెద్ద స్టోరీనే చెప్పి ఉంటాడు' అని అంటున్నారు. 'ఆ కుర్రాడి పని అయిపోయినట్టే..' అని మరికొందరు కామెంట్స్ చేశారు. 'ఈ సమస్యనుండి అతను అంత ఈజీగా బయటపడతాడని నేను అనుకోవడం లేదు' అంటూ మరొకరు కామెంట్ చేశారు. 'అతనింకా బ్రతికే ఉన్నాడా?' అని మరొకరు చమత్కారం చేశారు.
Viral Video: వామ్మో.. దీన్ని డాన్స్ అంటారా తల్లీ..? హీల్స్ వేసుకుని.. చీర కట్టుకుని ఈ యువతి వేసిన డాన్స్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!
Updated Date - 2023-05-31T19:23:03+05:30 IST