Union Minister Smriti Irani: రాజస్థాన్ ఖిమ్‌సర్ కోటలో స్మృతీఇరానీ కుమార్తె పెళ్లి రేపు...కాబోయే అల్లుడు ఎవరంటే...
ABN, First Publish Date - 2023-02-08T12:04:39+05:30
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కుమార్తె షానెల్లే ఇరానీ వివాహం రేపు రాజస్థాన్ రాష్ట్రంలోని పురాతన కోటలో జరగనుంది....
జోద్‌పూర్ (రాజస్థాన్): కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కుమార్తె షానెల్లే ఇరానీ వివాహం రేపు రాజస్థాన్ రాష్ట్రంలోని పురాతన కోటలో జరగనుంది.(Union Minister Smriti Irani) రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ ప్రాంతంలోని ఖిమ్‌సర్ కోటలో(Khimsar Fort) షానెల్లే ఇరానీ(Shanelle Irani), అర్జున్ భల్లాల(Arjun Bhalla) వివాహాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.స్మృతీ ఇరానీ కుమార్తె షానెల్లేకు ఎన్ఆర్ఐ అర్జున్ భల్లాతో 2021 డిసెంబర్‌లో నిశ్చితార్థం జరిగింది.
ఇది కూడా చదవండి: Aaftab Poonawala: శ్రద్ధావాకర్‌ను హత్య చేసిన 5 రోజులకే మరో గాళ్‌ఫ్రెండ్‌తో రాత్రిళ్లు గడిపాడు...
స్మృతీ ఇరానీ కాబోయే అల్లుడు అర్జున్ భల్లా కెనడియన్ న్యాయవాది. అతని తల్లిదండ్రులు, తాతలు భారతదేశానికి చెందినవారు.అర్జున్ భల్లా కెనడాలోనే పుట్టి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. అర్జున్ కెనడాలోని అంటారియోలోని టొరంటోలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. జంతు ప్రేమికుడు అయిన అర్జున్ కు పలు పెంపుడు జంతువులు ఉన్నాయి.యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి ఎల్‌ఎల్‌బి చదివిన తర్వాత 2014 మే నెలలో బ్రేక్ వాటర్ సొల్యూషన్స్ లో అకౌంట్ మేనేజర్‌గా చేరారు.
ఇది కూడా చదవండి: Happy Birthday Mohammad Azharuddin: అజారుద్దీన్‌ను వెంటాడిన రికార్డులు, వివాదాలు
అర్జున్ భల్లా ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో లా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. స్మృతీ ఇరానీ కాబోయే అల్లుడైన అర్జున్ కు 4లక్షల డాలర్ల ఆస్తులున్నాయి. కుమార్తె పెళ్లి కోసం కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ బుధవారం ఉదయం జోధ్ పూర్ విమానాశ్రయానికి వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాగౌర్ లోని ఖిమ్ సర్ కోటకు వెళ్లారు. కొద్దిమంది స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఇరానీ తన కుమార్తె వివాహం పురాతన కోటలో చేయనున్నారు.
Updated Date - 2023-02-08T12:50:25+05:30 IST