కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అర్ధరాత్రి ఇంట్లోకి సడన్‌గా భర్త రావడంతో.. ప్రియుడిని కూలర్‌లో దాచిన భార్య.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-11-04T15:55:17+05:30

భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు.. కొన్నిసార్లు వారి కాపురంలోనే చిచ్చు పెడుతుంటాయి. ఈ విషయం తెలిసినా చాలా మంది దంపతులు తప్పు మీద తప్పులు చేస్తుంటారు. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. ప్రియురాలితో...

Viral Video: అర్ధరాత్రి ఇంట్లోకి సడన్‌గా భర్త రావడంతో.. ప్రియుడిని కూలర్‌లో దాచిన భార్య.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త చేసే పనులు.. కొన్నిసార్లు వారి కాపురంలోనే చిచ్చు పెడుతుంటాయి. ఈ విషయం తెలిసినా చాలా మంది దంపతులు తప్పు మీద తప్పులు చేస్తుంటారు. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. ప్రియురాలితో ఉండగా భార్యకు దొరికిపోయిన భర్తలు.. ప్రియుడితో ఉంటూ భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతున్న భార్యలను తరచూ చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త సడన్‌గా ఇంట్లోకి వచ్చాడు. దీంతో ఆమె తన ప్రియుడిని కూలర్‌లో దాచింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan) జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ మహిళ (woman) తన భర్తకు తెలీకుండా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగిస్తుండేది. భర్త లేని సమయంలో ప్రియుడు వారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు భర్త లేని సమయం చూసి రాత్రి వేళ అతను తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో సడన్‌గా భర్త, కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చారు. వారు వచ్చే ముందు అలెర్ట్ అయిన ఆమె.. (girlfriendhides her boyfriend in cooler) తన ప్రియుడిని కూలర్‌లో దాచింది.

Wife: పండుగ రోజు ఇంటికి రాని భర్త.. అర్ధరాత్రి ఉన్నట్టుండి ఫోన్‌లో ఫొటో చూసి ఖంగుతిన్న భార్య.. చివరకు...

అప్పటికే భార్యపై అనుమానంతో ఉన్న భర్త.. ఇంట్లోకి రాగానే మొత్తం వెతికాడు. ఇలా చివరకు కూలర్ వెనుకవైపు తిప్పి చూడగా.. అందులో వ్యక్తి దూక్కుని ఉండడం కనిపించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. భర్తకు దొరికిపోవడంతో భార్య తెల్లమొఖం వేసింది. అప్పటికీ తన తప్పేమీ లేనట్లుగా ప్రవర్తించింది. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారి వల్ల కాపురాలు నాశనమవుతున్నాయ్’’.. అని కొందరు, ‘‘వివాహేతర సంబంధాలు.. ఎప్పటికైనా బయటపడక తప్పదు’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా ఎవరైనా ప్లాన్ చేస్తారా.. పెళ్లి మంటపంలో వీడియో ప్లే చేయడంతో.. అతిథులు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి..

Updated Date - 2023-11-04T15:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising