ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife: ఏం చేయమంటారు..? నా భర్త వికలాంగుడు.. నేను ఇలాంటి పనులు చేస్తేనే ఇల్లు గడుస్తుందంటూ.. పోలీసులకు తేల్చిచెప్పిన ఈ మహిళ కథేంటంటే..

ABN, First Publish Date - 2023-03-30T15:51:44+05:30

ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి ఉంది. అలాంటిది ఇక భర్త పని చేయని స్థితిలో ఉంటే.. ఇక ఆ కుంటుంబం ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి ఉంది. అలాంటిది ఇక భర్త పని చేయని స్థితిలో ఉంటే.. ఇక ఆ కుంటుంబం ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే కుటుంబానికి కూడా ఇలాంటి సమస్యే వచ్చి పడింది. భర్త వికలాంగుడు కావడంతో వారి కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వీటి నుంచి గట్టెక్కేందుకు భార్య అనూహ్య నిర్ణయం తీసుకుంది. ‘‘ఏం చేయమంటారు..? నా భర్త వికలాంగుడు.. నేను ఇలాంటి పనులు చేస్తేనే ఇల్లు గడుస్తుందంటూ’’.. అంటూ ఇటీవల పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఈమె కథేంటంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో చిన్‌హట్ ప్రాంత పరిధి ప్రేమ్‌బాగ్ కాలనీలో విజయ్ యాదవ్ అనే వ్యక్తి.. భార్య ఆర్తి యాదవ్, నలుగురు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. విజయ్ వికలాంగుడు (disabled person) కావడంతో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. దీంతో రోజురోజుకూ ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఆర్తి కూడా రోజూ కూలి పనులకు వెళ్లేది. అయినా వచ్చే ఆదాయం అంతంతమాత్రమే కావడంతో వీరిని ఆర్థిక సమస్యలు (Financial problems) చుట్టుముట్టాయి. ఇటీవల వీరికి పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఆర్తి నిర్ణయించుకుంది. అయితే ఇందుకోసం ఆమె.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె దృష్టి వాహనాల చోరీ (Vehicle theft) వైపు మళ్లింది.

Viral Video: అవాక్కైన ఆనంద్ మహీంద్ర.. బొలెరో కారు రైల్వే ట్రాకుపై పరుగులు తీస్తే..!

రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్కూటీలపై నిఘా పెట్టింది. తాళం వేయకుండా ఉన్న స్కూటీలను గుర్తించి చోరీ చేయడం మొదలెట్టింది. ఇలా రెండేళ్లుగా ఆమె స్కూటీలను (Scooty theft) చోరీ చేస్తోంది. చోరీ చేసిన అనంతరం వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకునేది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండేళ్లుగా ఆమెను పట్టుకోలేకపోయారు. ఇటీవల స్కూటీ చోరీ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. ఇన్నాళ్లు మహిళ చోరీకి పాల్పడినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. ఎట్టకేలకు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన భర్త వికలాంగుడు కావడం, ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఇలాంటి పనులు చేస్తున్నట్లు అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె వద్ద నుంచి 6స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

Girl Friend: ప్రియుడి పేరేంటో కూడా తెలియకుండా 4 నెలలుగా డేటింగ్.. అతడిని అడగకుండానే పేరును ఆమె ఎలా తెలుసుకుందంటే..!

Updated Date - 2023-03-30T15:51:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising