Crime news: మరదలిపై ప్రేమ పెంచుకున్న వ్యక్తి.. ఉన్నట్టుండి భార్యకు తెలీకుండా చేసిన నిర్వాకంతో.. చివరకు ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-10-13T22:01:32+05:30
అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ వీరి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. భార్య, పిల్లలను సంతోషంగా చూసుకోవాల్సిన అతను.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు. భార్యకు తెలీకుండా...
అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ వీరి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. భార్య, పిల్లలను సంతోషంగా చూసుకోవాల్సిన అతను.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు. భార్యకు తెలీకుండా మరదలికి దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. చివరకు ఓ రోజు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. బీహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని (Bihar) భాగల్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక తారాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి చక్‌ధోబాయ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భర్త ఉపాధి నిమిత్తం లూథియానాలో ఉంటూ అక్కడే పని చేస్తున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల వీరి కుటుంబంలో ఊహించని సమస్య వచ్చిపడింది. సదరు వ్యక్తి తన భార్య, పిల్లలను సంతోషంగా చూసుకోవాల్సింది పోయి.. భార్య చెల్లెలిపై ప్రేమ (Love with wife sister) పెంచుకున్నాడు. భార్యకు తెలీకుండా చివరకు ఆమెతో ప్రేమాయణం నడిపించాడు. అప్పటి నుంచి తరచూ ఆమెను కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
అంతటితో ఆగకుండా సెప్టెంబర్ 30న భార్యకు తెలీకుండా మరదలిని వివాహం కూడా చేసుకున్నాడు. భర్త రెండో వివాహం (Second marriage) చేసుకున్నాడన్న వార్త తెలియగానే భార్య తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇటీవల ఓ రోజు స్థానిక సుల్తాన్‌గంజ్ సమీపంలోని (woman jumped into the water) గంగా నదిలో దూకింది. అయితే నీటిలో మునిగిపోతున్న ఆమెను చుట్టు పక్కల వారు గమనించారు. వెంటనే వారంతా నీటిలోకి దిగి అతికష్టం మీద ఆమెను కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను విచారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-10-13T22:01:32+05:30 IST