Wife: కూల్‌డ్రింక్‌లో విషం పెట్టి భర్తను చంపేందుకు ఓ భార్య స్కెచ్.. అసలు నిజం తెలిసిన ఆ భర్త ఏం చేశాడంటే..!
ABN, First Publish Date - 2023-11-21T16:34:48+05:30
దంపతుల మధ్య తలెత్తే సమస్యలు.. కొన్నిసార్లు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటాయి. భార్యలపై లేనిపోని సాకులు చూపుతూ చిత్రహింసలు పెట్టే భర్తలు చూస్తున్నాం.. అలాగే వివాహేతర సంబంధాలకు అలవాటు పడి చివరకు భర్తలను కూడా చాలా మందిని చూస్తున్నాం. తాజాగా..
దంపతుల మధ్య తలెత్తే సమస్యలు.. కొన్నిసార్లు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటాయి. భార్యలపై లేనిపోని సాకులు చూపుతూ చిత్రహింసలు పెట్టే భర్తలు చూస్తున్నాం.. అలాగే వివాహేతర సంబంధాలకు అలవాటు పడి చివరకు భర్తలను కూడా చాలా మందిని చూస్తున్నాం. తాజాగా, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కూల్ డ్రింక్‌లో విషం పెట్టి భర్తను చంపేందుకు ఓ భార్య స్కెచ్ వేసింది. అయితే అసలు నిజం తెలిసిన తర్వాత ఆ భర్త ఏం చేశాడంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మోహిత్ అనే యువకుడికి కోమల్ అనే యువతితో ఐదు నెలల క్రితం (marriage) వివాహమైంది. అయితే ఇది ఆమెకు మూడో వివాహం కావడం గమనార్హం. వివాహమైన తర్వాత ఇద్దరూ ఎంతో సంతోషంగా కనిపించారు. దీంతో వారి మధ్య ఎలాంటి సమస్యలూ లేవని కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. అయితే వివాహమై ఏడాది పూర్తి కాకుండానే వారి మధ్య అనుకోని సమస్యలు (Problems between couples) తలెత్తుతాయని ఎవరూ ఊహించలేదు.
నవంబర్ 15న ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోమల్ తన భర్తకు శీతలపానీయం (cold drink) ఇచ్చింది. అయితే అది తాగిన కొద్దిసేపటికి అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు శీతలపానీయం కలుషితమైనట్లు తెలిపారు. కూల్‌డ్రింక్‌లో విషం కలపడం వల్లే ఇలా జరిగిందన మోహిత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో కోలుకున్న మోహిత్.. తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘట న స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Updated Date - 2023-11-21T16:34:49+05:30 IST