ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: కనివినీ ఎరుగని వింత కేసు.. కొడుకు బర్త్ సర్టిఫికెట్‌లో భర్త పేరును తీసేసి.. ప్రియుడి పేరును చేర్చండంటూ..!

ABN, First Publish Date - 2023-08-17T18:20:08+05:30

వింత వింత సమస్యలు, వింత వింత కేసులకు సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నేను పెంచుకున్న ఎలుకను, కుక్కను ఎవరో ఎత్తుకెళ్లారని కొందరు, బాయ్‌ఫ్రెండ్ మాట్లాడలేదంటూ మరికొందరు, తల్లిదండ్రులు తమను పట్టించుకోలేదంటూ ఇంకొందరు..

ప్రతీకాత్మక చిత్రం

వింత వింత సమస్యలు, వింత వింత కేసులకు సంబంధించిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నేను పెంచుకున్న ఎలుకను, కుక్కను ఎవరో ఎత్తుకెళ్లారని కొందరు, బాయ్‌ఫ్రెండ్ మాట్లాడలేదంటూ మరికొందరు, తల్లిదండ్రులు తమను పట్టించుకోలేదంటూ ఇంకొందరు.. పోలీసులకు వింత వింత ఫిర్యాదులు చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడూ ఇలాంటి కేసులు కోర్టుల మెట్లు కూడా ఎక్కుతుంటాయి. తాజాగా, ముంబైలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. కొడుకు బర్త్ సర్టిఫికెట్‌లో భర్త పేరును తీసేసి.. ప్రియుడి పేరును చేర్చండంటూ.. ఓ మహిళ కోర్టుకు వెళ్లింది. చివరకు ఏం జరిగిందంటే..

ముంబైలో (Mumbai) ఇటీవల ఓ విచిత్రమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. స్థానిక ప్రాంతానికి చెందిన మహిళ.. ఏడాది క్రితం తన భర్త నుంచి విడిపోయింది. తర్వాత ఆమె తన ప్రియుడితో కలిసి సహజీవనం (Live in relationship) చేసింది. ఆ సమయంలో సదరు మహిళ గర్భం దాల్చింది. ప్రసవం కోసం ఆమె నవీ ముంబైలోకి ఓ ఆస్పత్రిలో చేరింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రసవం అనంతరం అసలైన సమస్య వచ్చి పడింది. ఆమె మొదటి భర్తతో అధికారికంగా విడాకులు తీసుకోకపోవడంతో బిడ్డ బర్త్ సర్టిఫికెట్‌లో (Birth certificate) తండ్రిగా మొదటి భర్త పేరు నమోదైంది. దీంతో తర్వాత ఆమె దీనిపై అధికారులను కలిసి విన్నవించుకుంది. పిల్లల బర్త సర్టిఫికెట్‌లో తండ్రి స్థానంలో తన ప్రియుడి పేరును చేర్చాలని కోరింది. అయితే అధికారులు ఇందుకు అంగీకరించలేదు. చట్టబద్ధంగా అలా కుదరదంటూ తేల్చి చెప్పారు.

Viral: ఓరి దేవుడో.. ఇలాంటి బాస్‌లు కూడా ఉంటారా..? ఆఫీసులో ఓ ఉద్యోగి ఫోన్‌ను ఛార్జింగ్ పెడుతున్నాడని..!

అధికారుల సమాధానంలో సదరు మహిళ చివరకు వాషి మెజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు చేసుకుంది. అయితే అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో ఫైనల్‌గా హైకోర్టులో (High Court) పిటిషన్ వేసింది. అందులో ఆమె 2011లో ఇదే విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గుర్తు చేసింది. సింగిల్ పేరెంట్ లేదా అవివాహితకు పుట్టిన బిడ్డకు జనన ధ్రవీకరణ పత్రం జారీ చేసే సమయంలో దరఖాస్తుదారు నుంచి అఫిడవిట్ పొందిన తర్వాతే బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాలన్న కోర్టు తీర్పును గుర్తు చేసింది. కాగా, ఈ పిటిషన్‌పై ఆగస్టు 8న హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం మున్సిపల్ కార్పొరేషన్, అసిస్టెంట్ కమిషనర్‌కు బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను బెంచ్.. సెప్టెంబర్ 7కి వాయిదా వేసింది. కాగా, ఈ వార్త (Viral news) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Mother: శుభ్రం చేద్దామని 26 ఏళ్ల కొడుకు గదిలోకి వెళ్తే ఏదో పాడు వాసన.. ఏంటా అని అనుమానంతో మంచం కింద చూస్తే..!

Updated Date - 2023-08-17T18:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising