ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఢిల్లీ మెట్రోలో యువతి విన్యాసాలు.. విమర్శలతో విరుచుకుపడుతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2023-07-19T14:02:00+05:30

సోషల్ మీడియలో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యేందుకు కొందరు వింత వేశాలు వేస్తున్నారు.

Delhi Metro: సోషల్ మీడియలో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యేందుకు కొందరు వింత వేశాలు వేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోనే బరితెగించేస్తున్నారు. ఇక ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ అశ్లీలతకు అడ్డగా మారుతోంది. ఢిల్లీ మెట్రోలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలే దీనికి నిదర్శనం. మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. దాంతో ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొందరు ఆకతాయిలు చేసే పనుల వల్ల ఇలా ఢిల్లీ మెట్రో అభాసుపాలు అవుతోంది. ఢిల్లీ మెట్రో అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాపులారిటీ కోసం కొందరు యువత ఇలాంటి ఆకతాయి పనులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇదే కోవలో ఢిల్లీ మెట్రోలో ఓ యువతి చేసిన పనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. రన్నింగ్‌లో ఉన్న మెట్రోలో యువతి ఇంట్లో చేసినట్లు ఎక్సర్‌సైజులు చేయడం మనం చూడొచ్చు. ట్రైన్‌లో ఉన్న మిగతా ప్రయాణికులు ఆమెను చూస్తున్న కూడా తన విన్యాసాలు ఆపలేదు. ఆ సమయంలో తీసిన వీడియోను 'కాలిస్టెనిక్స్ ఇన్ పబ్లిక్' క్యాప్షన్‌తో ఒకరు సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో మెట్రోలో యువతి చేసిన విన్యాసాల తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఇలాంటివి ఇంట్లో చేసుకోవాలి. పబ్లిక్‌లో ఏంటీ న్యూసెన్స్' అని మండిపడుతున్నారు. 'మీరు చేసిన విన్యాసాలు బాగానే ఉన్నాయి. కానీ, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి స్టంట్స్ చేయడం అసలేం బాలేదు' అని ఒకరు, 'ఢిల్లీ మెట్రోలో మీకు స్వాగతం' అని మరొకరు వ్యంగ్యంగా స్పందించారు.

Girlfriend: ప్రియుడితో ఏకాంతం కోసం ఎంత పని చేసిందంటే.. నెట్టింట వైరల్‌గా మారిన యువతి వ్యవహారం..!


Updated Date - 2023-07-19T14:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising