ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఫ్యామిలీ కోర్టులో నాగిని డాన్స్.. న్యాయమూర్తి వాదనలు వింటోంటే సడన్‌గా ఓ మహిళ కింద పడిపోయి..!

ABN, First Publish Date - 2023-08-29T18:59:23+05:30

నేరాలకు పాల్పడే వారంతా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సినిమాల తరహాలో కట్టు కథలు అల్లితే.. మరికొందరు పక్కా పథకం ప్రకారం స్కెచ్ వేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తుంటారు. అయితే ఇలాంటి వారు ఎప్పుడో రోజు..

నేరాలకు పాల్పడే వారంతా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సినిమాల తరహాలో కట్టు కథలు అల్లితే.. మరికొందరు పక్కా పథకం ప్రకారం స్కెచ్ వేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తుంటారు. అయితే ఇలాంటి వారు ఎప్పుడో రోజు కోర్టు శిక్షల నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఈ విషయం పక్కనపెడితే.. ఎందుకు చేసిందో ఏమో తెలీదు గానీ.. కోర్టు హాలులో మహిళ వేసిన నాగిని డాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. న్యాయమూర్తి వాదనలు వింటున్న సమయంలో సడన్‌గా కిందపడ్డ మహిళ.. నాగిని డాన్స్ చేయడం ప్రారంభించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) సహరాన్‌పూర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న కుటుంబం.. వారి సమస్యల కారణంగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. కోర్టు హాలులో మహిళ వింత ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు. కోర్టులో జడ్జి ఎదురుగా ఇరువైపు వర్గాలకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. న్యాయమూర్తి వాదనలు వింటుండగా ఒక్కసారిగా ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ సడన్‌గా కింద పడిపోయింది. కళ్లు తిరిగి పడిపోయిందేమో అని అంతా అనుకున్నారు. అయితే కింద పడ్డ మహిళ.. (Woman Nagini dance in court hall) విచిత్రంగా నాగిని డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.

Metro Train: మెట్రో రైల్లో షాకింగ్ సీన్.. ఒక్కసారిగా అవాక్కైన ప్రయాణీకులు.. ఈ యువతులంతా ఏం చేశారో మీరే చూడండి..!

దీంతో అప్పటిదాకా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్దాం అనుకున్న వాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పాములా పడగ విప్పినట్లుగా నటిస్తూ.. బుసలు కొడుతూ నేలపై అటూ ఇటూ పాకుతూ ఉంది. అక్కడున్న వారంతా ఆమెను వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఇలా సుమారు 20 నిముషాల పాటు ఆమె నాగిని డాన్స్ చేస్తూనే ఉంది. చేసేదేమీలేక అంతసేపూ అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారు. తర్వాత ఆమె శాంతించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్న వారు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘కోర్టు హాలులో నాగిని డ్యాన్స్.. సూపర్’’.. అంటూ కొందరు, ‘‘తీర్పు అనుకూలంగా వచ్చేందుకు భలే ప్లాన్ చేసిందే’’.. అంటూ మరికొందరు, ‘‘ఆ సమయంలో నిజమైన పామును వదిలుండాల్సింది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Wife: భార్య నల్లగా ఉందంటూ కరెంట్ షాకిచ్చి చంపేసిన భర్త.. ఐస్ బాక్సులో పెట్టి తప్పించుకునేందుకు స్కెచ్.. ఎలా దొరికిపోయాడంటే..!

Updated Date - 2023-08-29T18:59:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising