Viral Video: 'చెత్త ప్రవర్తన' అంటూ మహిళను తిట్టి పోస్తున్న నెటిజన్లు.. వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు..!
ABN, First Publish Date - 2023-08-06T14:01:44+05:30
బీచ్ (Beach) లో ఓ మహిళ చేసిన పని తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Viral Video: బీచ్ (Beach) లో ఓ మహిళ చేసిన పని తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళపై దుమ్మెత్తిపోస్తున్నారు. 'చెత్త ప్రవర్తన' అంటూ మహిళను తిట్టి పడేస్తున్నారు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ మహిళ బీచ్ వెంబడి పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకుని చెత్తను సేకరించడం మనం చూడొచ్చు. అలా ఆమె చెత్త సేకరిస్తుండగా మరో మహిళ దాన్నంతటిని వీడియో తీసింది. బీచ్‌లో కొంతవరకు అలా చెత్తను సేకరించిందామె. రెండు బ్యాగులు నింపింది. ఒకటి భుజంపై వేసుకుని, మరోకటి చేతితో లాగుతూ ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చింది.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ వీడియోలు, ఫొటోలు తీయించుకోవడం అయిపోయిన తర్వాత ఆమె చేసిన పని ఉంది చూడండి. బాబోయ్.. ఇలాంటి వారు కూడా ఉంటారా? అనుకునేలా చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. సేకరించిన చెత్తతో కూడిన ఆ రెండు బ్యాగులను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అంటే.. ఆమె చేసిందంతా కేవలం ఫొటోలు, వీడియో కోసమే అన్నమాట. అంతే.. ఆ వీడియో కాస్తా నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది (Video goes Viral). వీడియోలోని మహిళను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. 'చెత్త ప్రవర్తన' అంటూ ఆమెను తిట్టి పోస్తున్నారు. 51 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ఈ నెల 3వ తారీఖుున ట్విట్టర్‌లో పోస్ట్ కాగా, ఇప్పటివరకు 1.1మిలియన్ల మంది వీక్షించారు. పదివేలకు పైగా లైక్స్ వచ్చిపడ్డాయి. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియనప్పటికీ మహిళ తీరు పట్ల మాత్రం నెటిజన్లు కన్నెర్ర చేస్తున్నారు.
Viral News: లవర్ భార్యను చంపేందుకు మైండ్‌బ్లాక్ అయ్యే ప్లాన్.. ఓ మహిళ ఏం చేసిందంటే..!
Updated Date - 2023-08-06T14:01:44+05:30 IST