ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త ప్రతీకారానికి భార్య సహకారం.. పొరిగింట్లో అతడు చేసిన పాడు పనిని సమర్థిస్తూ.. దగ్గరుండి వీడియో తీసి మరీ..

ABN, First Publish Date - 2023-03-17T16:13:56+05:30

గొడవలు పడే భర్తను వారించి, సక్రమమైన మార్గంలో నడిపించడంలో భార్య సహకారం ఎంతో ఉంటుంది. ఇక పరాయి మహిళలను తన భర్త కన్నెత్తి కూడా చూడకూడదని ఏ భార్య అయినా అనుకుంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గొడవలు పడే భర్తను వారించి, సక్రమమైన మార్గంలో నడిపించడంలో భార్య సహకారం ఎంతో ఉంటుంది. ఇక పరాయి మహిళలను తన భర్త కన్నెత్తి కూడా చూడకూడదని ఏ భార్య అయినా అనుకుంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ.. ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. పొరిగింటి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్న భర్తను అడ్డుకోవాల్సింది పోయి.. అండగా నిలిచింది. గర్భిణిగా ఉన్న మహిళపై భర్త చేసిన దారుణాన్ని దగ్గరుడి వీడియో కూడా తీసింది. చివరకు ఏం జరిగిందంటే..

ఒడిశా (Odisha) నంబరంగ్‌పూర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. మిస్త్రీ తాపీ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇతడి భార్య స్థానికంగా ఆశా వర్కర్‌గా (Asha worker) పని చేస్తుంటుంది. ఇదిలావుండగా, మిస్త్రీకి తన పొరిగింటి వ్యక్తి మధ్య ఇటీవల గొడవలు (quarrels) మొదలయ్యాయి. తరచూ ఇద్దరూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో పొరిగింటి వ్యక్తిపై మిస్త్రీ పగ పెంచుకున్నాడు. ఎలాగైనా, ఎప్పటికైనా ప్రతీకారం (revenge) తీర్చుకోవాలని అనుకుంటూ ఉండేవాడు.

Onion Peels: ఈ నిజాలు తెలిస్తే ఉల్లిపాయ పొట్టును ఇకపై అస్సలు పడేయరు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు లాభాలు..!

ఇదే విషయాన్ని తన భార్యకూ చెప్పాడు. గొడవలు ఎందకండీ.. అని సర్దిచెప్పాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా భర్తకే మద్దతు పలికింది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న అతను.. చివరకు ఇలాంటి పని చేస్తాడని ఎవరూ ఊహించలేదు. పొరిగింటి వ్యక్తిపై ఉన్న కోపాన్ని.. అతడి భార్యపై తీర్చుకోవాలని కుట్ర పన్నాడు. ఫిబ్రవరి 28న భర్త ఇంట్లో లేని సమయంలో తన భార్యను తీసుకుని పొరిగింటికి వెళ్లాడు. గర్భిణిగా ఉన్న సదరు మహిళపై భార్య ఎదుటే అఘాయిత్యానికి (Sexual assault on pregnant woman) పాల్పడ్డాడు. సాటి మహిళ అనే జాలి కూడా లేకుండా మిస్త్రీ భార్య కూడా.. భర్తను ప్రోత్సహించింది.

Viral Video: రైల్లో డాన్స్‌ను ఇరగదీసిన యువతి.. కానీ ‘అప్పర్ బెర్త్‌’పై పడుకున్న ఈ కుర్రాడి గురించే నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

అంతటితో ఆగకుండా భర్త చేస్తున్న తప్పుడు పనిని.. దగ్గరుండి తన ఫోన్‌లో వీడియో (Video) కూడా తీసింది. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో (Social media) షేర్ చేశారు. కొన్నాళ్లకు ఈ విషయం బాధితురాలికి తెలిసి అమవానకరంగా భావించింది. ఈ క్రమంలో సోమవారం ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు విచారించగా.. జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాసేపట్లో పెళ్లనగా ఫోన్‌కాల్.. వధువు చెప్పిన సమాధానం విని పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

Updated Date - 2023-03-17T16:13:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising