కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మహిళ పిలవగానే భయపడుతూ వచ్చిన వీధి కుక్క.. సీన్ కట్ చేస్తే.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-11-17T16:49:04+05:30

కొందరు జంతువుల పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తుంటారు. ఇంకొందరు తమ జీవితాన్ని జంతు సంరక్షణకే అంకితం చేస్తుంటారు. ఇలాంటి వారు జంతువులకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. వాటిని తమ సొంత పిల్లల్లా చూసుకుంటుంటారు. ఇలాంటి..

Viral Video: మహిళ పిలవగానే భయపడుతూ వచ్చిన వీధి కుక్క.. సీన్ కట్ చేస్తే.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

కొందరు జంతువుల పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తుంటారు. ఇంకొందరు తమ జీవితాన్ని జంతు సంరక్షణకే అంకితం చేస్తుంటారు. ఇలాంటి వారు జంతువులకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. వాటిని తమ సొంత పిల్లల్లా చూసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీధి కుక్కను చూసిన ఓ మహిళ.. దగ్గరికి రమ్మంటూ పిలిచింది. దీంతో భయం భయంగానే కుక్క ఆమె వద్దకు వెళ్లింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కారులో వెళ్తున్న మహిళకు (woman) .. రోడ్డు పక్కన ఓ వీధి కుక్క (stray dog) ఇబ్బంది పడుతూ కనిపిస్తుంది. దీంతో వెంటనే తన కారును ఆపి, దాని వద్దకు వెళ్తుంది. దగ్గరికి రమ్మంటూ చేయి చాపి పిలుస్తుంది. అయితే ఆ కుక్క మాత్రం భయంతో వణికిపోతూ దూరంగా ఉండిపోతుంది. అయితే ఆమె పదే పదే పిలుస్తుండడంతో భయం భయంగానే మెల్లగా ఆమె వద్దకు వస్తుంది. తర్వాత మహిళ కుక్క తలపై చేయి వేసి, ప్రేమగా నిమురుతుంది.

Viral Video: వేడి వేడి సమోసాను ఎంతో ఇష్టంగా తింటున్న బాలిక.. మధ్యలో అనుమానం వచ్చి లోపల చూడగా.. షాకింగ్ సీన్..

మహిళ ప్రేమగా నిమరడంతో కుక్కకు కాస్త భయం తగ్గుతుంది. తర్వాత దాన్ని తీసుకుని తన కారులో ఇంటికి వెళ్తుంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ కుక్కకు పూర్తిగా భయం పోయి.. తనని కాపాడిన యజమానిపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. అది ఎంతలా అంటే ఆమెకు ముద్దులు పెడుతూ థ్యాంక్స్ చెబుతుంది. ఇలా ఆ వీధి కుక్క కాస్తా.. ఆమెకు పెంపుడు కుక్కలా మారిపోతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బస్సులో భార్యకు సీటు లేకపోవడంతో భర్త వెరైటీ ప్లాన్.. చివరకు వారు చేసిన పనికి.. అవాక్కయిన ప్రయాణికులు..

Updated Date - 2023-11-17T16:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising