ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: లవర్ భార్యను చంపేందుకు మైండ్‌బ్లాక్ అయ్యే ప్లాన్.. ఓ మహిళ ఏం చేసిందంటే..!

ABN, First Publish Date - 2023-08-06T12:56:19+05:30

ఇటీవలి కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి ఎంతటి దారుణానికైన వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తరచూ పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి కూడా. తాజాగా ఇదే కోవలో కేరళ రాష్ట్రంలో దారుణాతి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

Viral News: ఇటీవలి కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి ఎంతటి దారుణానికైన వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తరచూ పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి కూడా. తాజాగా ఇదే కోవలో కేరళ రాష్ట్రంలో దారుణాతి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అందులోనూ ఓ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం. వివాహితుడిని ప్రేమించిన ఆమె తన లవర్‌ను దక్కించుకునేందుకు మైండ్‌బ్లాక్ అయ్యే ప్లాన్ వేసింది. ఆమె ప్లాన్ చూసి పోలీసులు, వైద్యులే నివ్వెరపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. పతనంతిట్టకు చెందిన స్నేహ అనే మహిళ రెండు రోజుల కింద ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో అనూష అనే మహిళ ఆస్పత్రిలో ఉన్న స్నేహను హతమార్చాలనుకుంది. దీనికి కారణం కొన్నేళ్ల నుంచి స్నేహ భర్తను అనూష ప్రేమిస్తుంది. దాంతో స్నేహను చంపేస్తే ప్రియుడిని పెళ్లాడి హాయిగా ఉండొచ్చని అనుకుంది. చాలా రోజుల నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్న ఆమెకు స్నేహ ఆస్పత్రిలో చేరడంతో ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఆ ఐడియాను అమలు చేసింది.

Zomato: 'ప్లీజ్.. ఇకపై అలా చేయకమ్మా.. ఆపేయ్'.. ట్విట్టర్‌లో యువతికి జొమాటో రిక్వెస్ట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!


తాను నర్సునంటూ స్నేహ ఉన్న ఆస్పత్రిలోకి ప్రవేశించింది. అనంతరం ఆమె ఉన్న బెడ్ వద్దకు వెళ్లి, గాలి నింపిన సిరంజీతో స్నేహను ఇంజెక్షన్ ఇవ్వాలని చూసింది. కానీ, అక్కడే ఉన్న స్నేహ తల్లి సదరు నర్సు తీరుపై అనుమానంతో వెంటనే వైద్యులను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొన్నేళ్ల నుంచి స్నేహ భర్తతో ప్రేమలో ఉన్న అనూష అతడితో కలిసి జీవించేందుకే అడ్డుగా ఉన్న స్నేహను చంపేయాలని చూసినట్లు పోలీసులు తేల్చారు.

Cab driver extorts: క్యాబ్‌లో వెళ్తున్నారా? ఇలాంటి వారుంటారు జాగ్రత్త సుమీ..!

Updated Date - 2023-08-06T13:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising