Woman: కాబోయే భార్యే కదా అని అతిగా నమ్మేశాడు.. చివరకు కోటి రూపాయలు మటాష్.. ఇదేంటని ఆమెను నిలదీస్తే..!
ABN, First Publish Date - 2023-09-21T18:05:10+05:30
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఆదాయ మార్గాలకు కొదువే లేకుండా పోయింది. కాస్తంత ట్యాలెంట్ ఉండాలే గానీ.. ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదించే వెసులుబాటు వచ్చింది. అయితే మరోవైపు ఇదే సోషల్ మీడియా..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఆదాయ మార్గాలకు కొదువే లేకుండా పోయింది. కాస్తంత ట్యాలెంట్ ఉండాలే గానీ.. ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదించే వెసులుబాటు వచ్చింది. అయితే మరోవైపు ఇదే సోషల్ మీడియా.. వివిధ రకాల మోసాలకూ వేదికగా కూడా మారుతోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాబోయే భార్యే కదా అని అతిగా నమ్మేశాడు. చివరకు కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బెంగళూరుకు (Bangalore) చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ ప్రొఫెషనల్‌గా పని చేస్తున్నాడు. ఇతడు తన భార్యకు విడాకులు (Divorce) ఇచ్చి.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. రెండో వివాహం (Second marriage) చేసుకునేందుకు ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో (Matrimonial website) తన వివరాలు నమోదు చేశాడు. దీంతో ఇటీవల అతడికి బెంగళూరుకు చెందిన ప్రగతి అనే ఓ మహిళ (woman) నుంచి మెసేజ్ వచ్చింది. తాను కూడా భర్తకు విడాకులు ఇచ్చి.. రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో రోజూ చాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. ఇలా నాలుగు నెలల్లోనే వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను అతడు ఎంతో నమ్మాడు. దీన్నే ఆమె చివరకు అవకాశంగా తీసుకుంది.
ఓ రోజు అతడితో తాను ఆన్‌లైన్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో (Online Foreign Exchange Trading Platform) పెట్టుబడి పెట్టినట్లు చెప్పింది. తద్వారా తనకు రూ.12కోట్ల లాభం వచ్చిదంటూ నమ్మించింది. దీంతో అతను ఆమె మాటలు నమ్మి ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం రూ.1.5కోట్లు పెట్టుబడి పెట్టాడు. అయితే ఈ క్రమంలో అతడి అకౌంట్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న ఆమె.. అతన్ని అందులో నుంచి బ్లాక్ చేసింది. చివరకు ఆ డబ్బులను తానే కొట్టేసింది. తర్వాత అటువైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో.. బాధితుడు మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మాట్రిమోనియల్ ప్లాట్‌ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరిచయమయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, పూర్తి వివరాలు తెలుసుకోకుండా నమ్మి మోసపోవద్దని సూచించారు.
Updated Date - 2023-09-21T18:05:10+05:30 IST