Paytm Money: ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిందో మహిళ.. తిరిగి పంపమని అడిగితే అతడి రియాక్షన్ ఇదీ..!
ABN, First Publish Date - 2023-09-13T15:14:01+05:30
ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న మొత్తమైనా లేదా పెద్ద మొత్తమైనా.. ఏదైనా ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం.. ఇలా వివిధ యాప్‌ల ద్వారా పంపించడం సర్వసాధారణమైపోయింది. ఈ వెసులుబాటు వల్ల ఎంత సౌలభ్యం ఉందో.. కొన్నిసార్లు ..
ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న మొత్తమైనా లేదా పెద్ద మొత్తమైనా.. ఏదైనా ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం.. ఇలా వివిధ యాప్‌ల ద్వారా పంపించడం సర్వసాధారణమైపోయింది. ఈ వెసులుబాటు వల్ల ఎంత సౌలభ్యం ఉందో.. కొన్నిసార్లు అంతే స్థాయిలో సమస్యలూ తలెత్తుతుంటాయి. కొన్నిసార్లు కొందరు నగదును ఒకరికి పంపాల్సింది పోయి మరొకరికి పంపుతుంటారు. ఇలాంటి సమయాల్లో ఆ నగదును తిరిగిపొందేందుకు నానా తంటాలు పడుతుంటారు. తాజాగా, ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. పొరపాటున డబ్బులు పంపిన వ్యక్తికి మెసేజ్ చేయగా.. అతడు ఇచ్చిన సమాధానం ఏంటంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఆన్‌లైన్ పేమెంట్ (Online payment) చేసేందుకు పేటీఎం (Paytm) నుంచి కొంత మొత్తాన్ని తనకు తెలిసిన వారికి పంపించింది. అయితే తీరా నగదు పంపించాక చూడగా.. ఫోన్ నంబర్ (phone number) తప్పుగా ఎంటర్ చేశానని తెలుసుకుంది. దీంతో నాలుక్కరుచుకుని.. సదరు వ్యక్తికి మెసేజ్ చేసింది. ‘‘హాయ్ అండీ.. వేరే వ్యక్తికి పంపాల్సిన నగదును పొరపాటున మీకు పంపా. దయచేసి తిరిగి పంపగలరు’’.. అని సదరు వ్యక్తికి మెసేజ్ చేసింది. ఈ మెసేజ్ చూసుకున్న అవతలి వ్యక్తి ఇచ్చిన రిప్లై చూసి మహిళ అవాక్కయింది.
నో అంటూ అతను సమాధానం ఇవ్వడంతో షాకైన మహిళ.. మళ్లీ ప్లీజ్ అంటూ బ్రతిమాలుకుంటుంది. చివరకు స్మైలీ ఎమోజీలు పంపిన అవతలి వ్యక్తి.. ‘‘బాధపడొద్దు.. మీ డబ్బు మీకు పంపిస్తా’’.. అని చివరకు మహిళ భయాన్ని పోగొడతాడు. చెప్పిటనట్లుగానే మహిళ పంపిన మొత్తాన్ని తిరిగి ఆమెకు పంపడంతో.. సదరు మహిళ అతడికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. కాగా, వీరి మధ్య నడిచిన మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారు ఉండబట్టే.. మంచి ఇంకా బతికి ఉంది’’.. అంటూ కొందరు, ‘‘డబ్బులు పంపే సమయంలో ఒకటికి పదిసార్లు నంబర్ సరిచూసుకోవాలి’’.. అంటూ మరికొందరు, ‘‘మీరు గ్రేట్ బ్రదర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-09-13T15:26:09+05:30 IST