ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 విడాకుల కేసులు.. ఒక్కొక్కరు ఎన్ని లక్షల కోట్లను భరణంగా ఇచ్చారంటే..

ABN , First Publish Date - 2023-02-12T17:18:57+05:30 IST

బాప్ రే.. కొందరు తమ భార్యల నుండి విడిపోవడానికి ఏకంగా ఇంతింత ఖర్చు చేశారా..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 విడాకుల కేసులు.. ఒక్కొక్కరు ఎన్ని లక్షల కోట్లను భరణంగా ఇచ్చారంటే..

వివాహ బంధంతో ఒక్కటైన వారిని విడదీసి మీ జీవితాలు మీరు చూసుకొండి అని చెబుతాయి విడాకులు. విడాకులు తీసుకున్నప్పుడు భర్తలు భార్యలకు భరణం ఇస్తారు. అయితే ప్రపంచంలో ధనవంతులున్నారు, బాప్ రే.. కొందరు తమ భార్యల నుండి విడిపోవడానికి లక్షలకోట్లను భరణంగా ఇచ్చారు. ఇంతకీ ప్రపంచంలోనే అత్యధికంగా భరణం ఇచ్చిన భర్తలు ఎవరు? ఎంత ఇచ్చారు తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది..

జెఫ్ బెజోస్..

WhatsApp Image 2023-02-12 at 4.46.58 PM.jpeg

అమెజాన్ స్థాపకుడు జెఫ్ బెజోస్ తన భార్య మెకెంజీ బెజోస్ కు ఇచ్చిన భరణం అక్షరాలా 2.75లక్షల కోట్లు. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. జెప్ బెజోస్ అంత మొత్తం భరణంగా ఇచ్చిన తరువాత మెకెంజీ బెజోస్ ప్రపంచంలో అత్యంత ధనవంతులలో 22వ స్థానానికి చేరింది. ప్రపంచంలో ఎక్కువ భరణం ఇచ్చిన వ్యక్తి జెప్ బెజోస్.

హార్వే వెయిన్ స్టెయిన్..

WhatsApp Image 2023-02-12 at 4.46.59 PM.jpeg

హాలీవుడ్ రారాజు వెయిన్ స్టెయిన్ విడాకులు చాలా చర్చనీయాంశమైనవి. ఇతను తన ఫ్యాషన్ డిజైనర్ ను పెళ్ళి చేసుకున్నాడు. 2017లో మహిళా ఆర్టిస్టులు చేపట్టిన మీటూ ఉద్యమం తరువాత ఇతని భార్య చాప్మన్ హార్వే, వెయిన్ స్టీన్ నుండి విడాకులు తీసుకుంది. ఇందుకుగానూ వెయిన్ స్టీన్ నుండి ఈమెకు దాదాపు 100కోట్లరూపాయలు భరణం లభించింది.

Read also: Lake of Skeletons: ఆ నదిలో వందల కొద్దీ అస్తిపంజరాలు.. చనిపోయిందెవరు..? అసలేం జరిగిందంటే..!

బిల్ గేట్స్..

WhatsApp Image 2023-02-12 at 4.46.58 PM (1).jpeg

మైక్రోసాప్ట్ యజమాని బిల్ గేట్స్ తన పెళ్ళయిన 27సంవత్సరాల తరువాత విడాకుల ఊసెత్తాడు. ఈయన తన భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తో చర్చల తరువాత వారి ఆస్తులను ఎలా పంచుకోవాలో నిర్ణయించుకుని విడాకులు ఇచ్చాడు. విడాకుల తరువాత మెలిండా దగ్గర 630కోట్లు విలువ చేసే షేర్ మార్కెట్ ఉన్నట్టు తెలిసింది.

ఎలోన్ మస్క్..

WhatsApp Image 2023-02-12 at 5.23.25 PM.jpeg

ట్విట్టర్ పిట్టను తన సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ద ట్రెండ్ గా మారిన ఎలోన్ మస్క్ ముచ్చటగా మూడాకులు టచ్ చేశాడు. ఇతను మూడు సార్లు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చాడు. మొదటి విడాకుల తరువాత ఈయన తన పిల్లల కోసం ప్రతి నెలా 16.40లక్షల రూపాయలు, ఇంకా బట్టలు ఇతర అవసరమైన వస్తువులను పంపేవాడట. అయితే మూడవసారి విడాకులు తీసుకున్న తరువాత ప్రతినెలా 1.40కోట్లు చెల్లిస్తున్నాడు.

ఈ ధనవంతులందరూ వారి భార్యలకు ఇచ్చిన భరణం చూస్తే వామ్మో కంపెనీలే కొనెయ్యచ్చురా నాయనా అంత డబ్బుతో అనిపించకమానదు. కోటీశ్వరుల జీవితాల్లో అన్నీ కోట్లతోనే ముడిపడి ఉంటాయి మరి.

WhatsApp Image 2023-02-12 at 5.23.25 PM.jpeg

Updated Date - 2023-02-12T17:29:19+05:30 IST