ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఓరి నాయనో.. ఇదేం కొట్టుకోవడంరా బాబూ.. డబ్ల్యూడబ్ల్యూఈలో కూడా ఇలాంటి ఫైట్ ఉండదేమో..!

ABN, First Publish Date - 2023-08-08T13:53:33+05:30

ఆడ లేదు.. మగ లేదు అందరూ ఒక్కటే కొట్టుకోవడం. డబ్ల్యూడబ్ల్యూఈలో కూడా ఇలాంటి ఫైట్ ఉండదేమో అనిపించేంతగా తన్నుకున్నారు.

Viral Video: ఆడ లేదు.. మగ లేదు అందరూ ఒక్కటే కొట్టుకోవడం. డబ్ల్యూడబ్ల్యూఈలో కూడా ఇలాంటి ఫైట్ ఉండదేమో అనిపించేంతగా తన్నుకున్నారు. అమెరికాలోని మోంట్‌గోమేరీ రివర్ ఫ్రంట్ (Montgomery Riverfront) వద్ద శనివారం జరిగిన ఆ ఘటన తాలూకు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పోర్టులోని డాక్ వర్కర్లు (Dock workers), బోట్ నడిపే గ్రూపుల మధ్య జరిగిందీ కొట్లాట. తెల్ల వాళ్లు ఒకవైపు, నల్ల వాళ్లు ఒకవైపు గ్రూపులుగా విడిపోయి మరీ కొట్టుకున్నారు. అలా వారు ఫైటింగ్ చేస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. వీడియోలో ఓ వ్యక్తి డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్‌లో మడతపెట్టిన కూర్చితో దాడి చేయడం మనం వీడియోలో చూడొచ్చు.

ఇక ఇద్దరు మహిళలైతే ఒక మహిళను కిందపడేసి మరీ కొట్టారు. అలా కిందపడ్డ ఆమె తలపై ఓ వ్యక్తి మడతపెట్టిన కూర్చితో దాడి చేశాడు. అలా కొద్దిసేపు ఓ రేంజ్‌లో ఆ ఫైటింగ్ జరిగింది. కొద్దిసేపటి తర్వాత మోంట్‌గోమేరీ పోలీసులు రంగప్రవేశం చేయడం, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం వీడియోలో ఉంది. కాగా, డాక్ వర్కర్ (బోట్ నుంచి వస్తువులను కిందకు దించే కూలీ) బోట్‌లోని సామాగ్రిని కిందకు దించేందుకు నిరాకరించడంతోనే ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు మోంట్‌గోమేరీ పోలీసులు వెల్లడించారు.

Viral News: ఇంట్లోని పాత సామాన్లు సర్దుతుంటే దొరికిందో ట్రంకు పెట్టె.. తీరా దాన్ని తెరిచి చూస్తే..!


Updated Date - 2023-08-11T07:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising