ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Women Crime News: వేసిన తలుపులు వేసినట్లే ఉన్నా.. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు.. మహిళ చెప్పింది విని పరుగెత్తుకుంటూ వెళ్లిన స్థానికులు.. చివరకు..

ABN, First Publish Date - 2023-06-06T20:21:28+05:30

ఒంటరిగా ఉన్న మహిళలపై ఎప్పుడు ఎవరు దాడులు చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా మంచిగా కనిపించే చాలా మంది.. మహిళలను చూడగానే మానవ మృగాళ్లలా మారిపోతుంటారు. తమ దారికి రాని వారిని చివరకు చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి దారుణాలు ఇటీవల ఎక్కువైపోయాయి. తాజాగా..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటరిగా ఉన్న మహిళలపై ఎప్పుడు ఎవరు దాడులు చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా మంచిగా కనిపించే చాలా మంది.. మహిళలను చూడగానే మానవ మృగాళ్లలా మారిపోతుంటారు. తమ దారికి రాని వారిని చివరకు చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి దారుణాలు ఇటీవల ఎక్కువైపోయాయి. తాజాగా, బీహార్‌లో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నా.. ఓ యువకుడు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించాడు. చివరకు మహిళ చెప్పింది విని స్థానికులు పరుగెత్తుకుంటూ వెళ్లి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) ముజఫర్‌పూర్‌లోని మనియారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు పిల్లలు ఉన్న తల్లి (mother) .. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కొన్ని రోజుల కిందట తన పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. రాత్రి పిల్లలతో కలిసి ఓ గదిలో పడుకుంది. అయితే అర్ధరాత్రి ఇదే ప్రాంతానికి చెందిన 24ఏళ్ల యువకుడు (young man) ఇంట్లోకి ప్రవేశించాడు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నా.. తలుపు పక్కన ఉన్న ఇటుక రాళ్లను తొలగించి లోపలికి వెళ్లాడు. ఉన్నట్టుండి లోపలికి వచ్చిన యువకుడిని చూసి మహిళ షాక్ అయింది.

Viral News: తీరా దండ వేసే సమయంలో వరుడిని చూసి బోరున విలపించిన వధువు.. బంధువులంతా చెబుతున్నా వినిపించుకోకుండా.. చివరకు ఏం చేసిందంటే..

దీంతో వెంటనే ఆమె నోరు మూసిన అతను.. చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి (Indecent behavior) పాల్పడ్డాడు. తర్వాత తలుపులు తీసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ఎలాగోలా కట్లు విడిపించుకున్న మహిళ బయటికి పరుగెత్తుకుంటూ వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. దీంతో స్థానికులంతా పరుగెత్తుకుంటూ వెళ్లి యువకుడిని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు (Patrolling Police) అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులను చూసిన యువకుడు.. భయంతో పారిపోయి తన ఇంట్లో దాక్కున్నాడు. ఎట్టకేలకు అక్కడికి వెళ్లిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. ఈ ఘటన స్థానింగా తీవ్ర సంచలనం కలిగించింది.

Viral Video: వీరు ఇక్కడే ఇలా వుంటే.. ఇక ఇంట్లో ఎలా వుంటారో.. మెట్రో రైల్లో మహిళల నిర్వాకంపై ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు..

Updated Date - 2023-06-06T20:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising