Viral Video: బైకుపై వెళ్తూ కారునే ఓవర్‌టేక్ చేసిన యువకుడు.. కాస్త ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా షాకింగ్ సీన్.. చివరకు..
ABN, First Publish Date - 2023-10-10T20:36:53+05:30
చేతిలో బైకులు ఉన్న చాలా మంది.. సినిమా తరహా స్టంట్స్ చేస్తూ అందరి ముందూ హీరోల్లా బిల్డప్ ఇస్తుంటారు. కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయోగాలు చేస్తూ చివరకు ప్రమాదాలబారిన పడుతుంటారు. ఇటీవల ...
చేతిలో బైకులు ఉన్న చాలా మంది.. సినిమా తరహా స్టంట్స్ చేస్తూ అందరి ముందూ హీరోల్లా బిల్డప్ ఇస్తుంటారు. కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయోగాలు చేస్తూ చివరకు ప్రమాదాలబారిన పడుతుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు చాలా చూశాం. తాజాగా, గుజరాత్‌లో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైకుపై వేగంగా వెళ్తూ కారునే ఓవర్‌టేక్ చేశాడు. కాస్త ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గుజరాత్‌లోని (Gujarat) సూరత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హైవే మార్గంలో ఇటీవల ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోజూ మాదిరే ఆ రోజు కూడా వాహనాల రాకపోకలతో హైవే రోడ్డు రద్దీగా ఉంది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి తన కెమెరాలో వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా షాకింఘ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బైకుపై వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చి కారును (biker overtaking car) ఓవర్‌టేక్ చేశాడు. కారును దాటి వేగంగా వెళ్తున్న అతను.. ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రక్షణ గోడను గుద్దుకున్నాడు.
అతను గోడపై పడిన తర్వాత ధబేల్‌మని రోడ్డుపై పడతాడు. అయితే ఆ వ్యక్తి ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకుని ఉండడంతో ఏమీ కాలేదు. అతను కిందపడగానే.. బైకు వేగంగా ముందుకు వెళ్లి కిందపడిపోయింది. కిందపడ్డ యువకుడు మళ్లీ పైకి లేచి పరుగెత్తుకుంటూ వెళ్లి కిందపడ్డ బైకును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి విన్యాసాలు చేస్తే.. ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం బాగుంది’’.. అంటూ మరికొందరు, ‘‘అతివేగం అత్యంత ప్రమాదకరం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-10T20:36:53+05:30 IST