ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime News: తాతా.. నేనూ అటే వెళ్తున్నా.. లిఫ్ట్ ఇస్తా అనగానే.. ఆ కుర్రాడి బైక్‌ను ఎక్కిన వృద్ధుడు.. బస్సులో వస్తానులే అని చెప్పి ఉంటే..!

ABN, First Publish Date - 2023-06-07T15:45:00+05:30

కొంతమంది యువకులు విధిలేని పరిస్థితుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే.. మరికొంత మంది యువకులు జల్సాలకు అలవాటు పడి దారుణాలకు తెగబడుతున్నారు. చాలా మంది ఆడా, మగా అనే తేడా లేకుండా దోపిడీలు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొంతమంది యువకులు విధిలేని పరిస్థితుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే.. మరికొంత మంది యువకులు జల్సాలకు అలవాటు పడి దారుణాలకు తెగబడుతున్నారు. చాలా మంది ఆడా, మగా అనే తేడా లేకుండా దోపిడీలు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న వృద్ధుడిని.. ఓ యువకుడు లిఫ్ట్ ఇస్తానంటూ బైకు ఎక్కించుకన్నాడు. చివరకు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ పరిధి భన్వర్కువా ప్రాంతంలోని తీన్ ఇమ్లీ కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బాబూలాల్ అనే వృద్ధుడు తన కూతురును చూడటానికి భోపాల్ నుంచి మంగళవారం రాత్రి ఇండోర్ (Indoor) వచ్చాడు. ఇండోర్‌లో రైలు దిగి.. తీన్ ఇమ్లీ కూడలి వద్ద బస్సు కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో అటుగా బైకుపై వెళ్తున్న ఓ యువకుడు.. బాబూలాల్‌ను గమనించాడు. అతడి వద్ద బండి ఆపి ఎక్కడికి వెళ్లాలో కనుక్కుని.. ‘‘తాతా.. నేనూ అటే వెళ్తున్నా.. లిఫ్ట్ ఇస్తారా’’.. అని అనడంతో వృద్ధుడు (old man) వెంటనే అతడి బైకు ఎక్కాడు. అయితే వృద్ధుడు చెప్పిన ప్రాంతం వైపు కాకుండా.. మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు.

Women Crime News: వేసిన తలుపులు వేసినట్లే ఉన్నా.. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు.. మహిళ చెప్పింది విని పరుగెత్తుకుంటూ వెళ్లిన స్థానికులు.. చివరకు..

నిర్మానుష్య ప్రదేశంలో బండి ఆపి, డబ్బులు ఇవ్వమంటూ బెదిరించాడు. ‘‘దయచేసి నన్ను వదిలెయ్’’.. అని వృద్ధుడు ఎంతగా ప్రాథేయ పడుతున్నా వినిపించుకోకుండా (young man attacks an old man) దాడి చేశాడు. చివరగా అతడి జేబులో ఉన్న రూ.9వేలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడి చేతిలో గాయపడిన వృద్ధుడు చివరకు ఇంటికి చేరుకుని జరిగిన విషయం తెలియజేశాడు. అంతా కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇదే దండగుడు అదే రోజు రాత్రి మరికొంత మందిపై కూడా దాడి చేసి, దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Viral Video: వీరు ఇక్కడే ఇలా వుంటే.. ఇక ఇంట్లో ఎలా వుంటారో.. మెట్రో రైల్లో మహిళల నిర్వాకంపై ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు..

Updated Date - 2023-06-07T15:45:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising