ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Woman: అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్న 32 ఏళ్ల మహిళ.. అడిగి మరీ లిఫ్ట్ ఇచ్చిన 26 ఏళ్ల యువకుడు.. తెల్లారేసరికి జరిగిన ఘోరమిదీ..!

ABN, First Publish Date - 2023-09-30T15:20:19+05:30

కొందరు మహిళలు ప్రతి ఒక్కరినీ నమ్మేస్తుంటారు. మాయమాటలు నమ్మి చివరకు దారుణంగా మోసపోయేవాళ్లను చాలా మందిని చూశాం. కొందరు యువకులు వారిని డబ్బుల విషయంలో మోసం చేస్తుంటే.. మరికొందరు..

ప్రతీకాత్మక చిత్రం

కొందరు మహిళలు ప్రతి ఒక్కరినీ నమ్మేస్తుంటారు. మాయమాటలు నమ్మి చివరకు దారుణంగా మోసపోయేవాళ్లను చాలా మందిని చూశాం. కొందరు యువకులు వారిని డబ్బుల విషయంలో మోసం చేస్తుంటే.. మరికొందరు ఏకంగా హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా, మహారాష్ట్రలో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్న ఓ మహిళ.. ‘‘మీ ఇంటి వద్ద దింపేస్తా మేడమ్’’.. అని ఓ యువకుడు అనడంతో అతడి బైకు ఎక్కింది. చివరకు ఏం జరిగిందంటే..

మహారాష్ట్ర (Maharashtra) పూణెలోని విమాన్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 32ఏళ్ల మహిళ (woman).. ఇదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తోంది. కాగా, శుక్రవారం ఆమె తన స్నేహితులతో కలిసి విమాన్ నగర్‌లోని ఓ హోటల్‌కి వెళ్లింది. అందరికీ కలిసి మొత్తం బిల్లు రూ.9,500లు అయింది. ఈ బిల్లు ఎవరు కట్టాలనే విషయంలో వారి వాగ్వాదం జరిగింది. చివరకు అంతా వెళ్లిపోవడంతో సదరు మహిళ చెల్లించాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో హోటల్ సిబ్బందికి, మహిళకు గొడవ జరిగింది. చివరకు హోటల్ సిబ్బంది ఆమె వద్ద ఉన్న ఫోన్, ఆధార్, పాన్ కార్డులు తీసుకున్నారు.

Viral Video: ఇలా జరుగుతుందని ముందే తెలిసుంటే.. టోల్‌గేట్ డ్యూటీ కూడా చేసేవాడు కాదేమో.. ఇంతకీ అసలేమైందో మీరే చూడండి..

బిల్లు కట్టిన తర్వాత వాటిని తీసుకెళ్లమని చెప్పడంతో చేసేదేమీలేక ఇంటికి బయలుదేరింది. అయితే బయటికి వెళ్లగానే 26 ఏళ్ల యువకుడు బైకులో ఆమె వద్దకు వచ్చి ఇంటి వద్ద దింపుతానని చెప్పాడు. ‘‘ఏం భయం వద్దు.. నన్ను నమ్మండి’’.. అని చెప్పడంతో అతడిని నమ్మి బైకు ఎక్కింది. ఇంటికి తీసుకెళ్లాల్సిన అతను.. చివరకు ఓ హోటల్‌కి తీసుకెళ్లాడు. ఆమె పేరుతోనే ఓ గది బుక్ చేసి, గదిలో ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. అపస్మారక స్థితిలో (Indecent behavior on woman) ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Woman: బైక్‌పై పారిపోతున్న వ్యక్తి.. కొడవలి తీసుకుని వెంటపడిన మహిళ.. ఊహించని సీన్‌తో ఆమె ఎలా మరణించిందంటే..!

Updated Date - 2023-09-30T15:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising