ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రియుడి నోట వింత డిమాండ్.. పోలీసులు వచ్చి పక్క ఊళ్లో ఉన్న ప్రేయసిని వెతికి తీసుకొచ్చాక..!

ABN, First Publish Date - 2023-06-01T19:12:53+05:30

నేటి తరం యువతీయువకులు.. చిన్న చిన్న సమస్యలకూ తీవ్రంగా కుంగిపోతుంటారు. చదువు విషయంలో కొందరు.. ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో మరికొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తాము అనుకున్నట్లు జరగని పక్షంలో చివరకు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి తరం యువతీయువకులు.. చిన్న చిన్న సమస్యలకూ తీవ్రంగా కుంగిపోతుంటారు. చదువు విషయంలో కొందరు.. ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో మరికొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తాము అనుకున్నట్లు జరగని పక్షంలో చివరకు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ప్రేమికుడికి సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హైడ్రామా సృష్టించాడు. చివరకు పోలీసులు అతడి వింత డిమాండ్‌కు తలొగ్గి.. తన ప్రేయసిని వెతికి తీసుకొచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సర్గుజా జిల్లా బటౌలీ బ్లాక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి, సమీప గ్రామానికి చెందిన యువతికి (young woman) ఇటీవల పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇది క్రమంగా ప్రేమకు (love) దారి తీసింది. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఒప్పుకోరనే భయం ఉండేది. దీంతో ప్రేమ విషయం కూడా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. యువకుడు ఉన్నట్టుండి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కసారిగా గ్రామంలోని వాటర్ ట్యాంక్ (Water tank) ఎక్కి, దూకేస్తానంటూ గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో అక్కడ జనం గుమికూడి.. యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Viral News: ఇలా ఉన్న యువతి ముఖం.. చివరకు ఇలా అయిపోయింది.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..!

ఎవరైనా తనను కిందకు దింపే ప్రయత్నం చేస్తే దూకేస్తానని చెప్పడంతో స్థానికులు భయపడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని యువకుడితో మాట్లాడారు. ఇంతకీ కారణం ఏంటని అడగ్గా.. తన ప్రేయసి కులం వేరు అని, అందుకే తన పెళ్లి కాదనే భయం ఉందని చెప్పాడు. ప్రియురాలు (girlfriend) చెప్పే వరకూ కిందకు దిగగని భీష్మించుకున్నాడు. దీంతో చేసేదేమీలేక పోలీసులు ఆమె వివరాలు కనుక్కుని, చివరకు అక్కడికి తీసుకొని వచ్చారు. కిందకు దిగాలని యువతి చెప్పడంతో యువకుడు శాంతించాడు. దీంతో సుమారు మూడు గంటల పాటు చోటుచేసుకున్న హైడ్రామాకు తెరపడింది. కాగా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral: స్కూటీలో పెట్రోల్ కొట్టించుకుని డబ్బుల్లేవన్న 15 ఏళ్ల పిల్లాడు.. ఏం అడిగినా నో రెస్పాన్స్.. అనుమానంతో పేపర్‌పై రాయమని అడిగితే..

Updated Date - 2023-06-01T19:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising