ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heartbreak Insurance: ప్రేమలో ఉన్నోళ్లకు సూపర్ ఐడియా.. ప్రేయసి సడన్‌గా హ్యాండిచ్చినా కుర్రాళ్లు ఇలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చట..!

ABN, First Publish Date - 2023-03-23T15:46:42+05:30

ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఇన్సూరెన్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. వ్యక్తులతో పాటూ వారి వాహనాలకూ ఇన్సూరెన్స్ చేస్తుంటారు. తద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం అందుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఇన్సూరెన్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. వ్యక్తులతో పాటూ వారి వాహనాలకూ ఇన్సూరెన్స్ చేస్తుంటారు. తద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం అందుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ప్రేమలో ఉన్నోళ్లు హెచ్ఐఎఫ్( Heartbreak Insurance) ద్వారా డబ్బులు సేవ్ చేసుకోవచ్చట. ప్రేయసి సడన్‌గా హ్యాండిచ్చినా డబ్బులు సేవ్ చేసుకోవచ్చని ఓ యువకుడు చెబుతున్నాడు. తన ప్రేయసి బ్రేకప్ చెప్పడంతో తనకు రూ.25వేలు వచ్చాయని చెప్పాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..

‘‘నా ప్రేయసి బ్రేకప్ చెప్పింది.. రూ.25 వేలు వచ్చేశాయి’’.. అంటూ ఓ యువకుడు పెట్టిన పోస్ట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా (Love viral posts) మారింది. ఓ వ్యక్తి తన ప్రేయసితో ప్రేమ మొదలుపెట్టే సందర్భంలో ఓ ఒప్పందం చేసుకున్నాడు. ‘‘మన మధ్య ఇప్పుడున్న ఈ ప్రేమ జీవితాంతం ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు.. కానీ మధ్యలో ఎవరిని ఎవరు మోసం చేసినా నష్టపరిహారం (compensation) చెల్లించాల్సి ఉంటుంది’’.. అని కండీషన్ పెట్టాడు. ఇందుకోసం ఇద్దరూ కలిసి బ్యాంకులో ఓ జాయింట్ అకౌంట్ (Joint Account) ఓపెన్ చేశారు. అందులో ప్రతి నెలా రూ.500లు జమ చేసేవారు.

అసలు నిజమేంటో చెప్పినా 19 ఏళ్ల ఆ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడో యువకుడు.. కానీ సరిగ్గా ఆరు నెలల తర్వాత..

చివరగా ఎవరు బ్రేకప్ చెప్పినా.. అందులోని మొత్తం మొసపోయిన వారికి చెందుతుంది. ఇదీ వీరి మధ్య కుదిరిన ఒప్పందం. అనుకున్నట్లుగానే ప్రతి నెలా అందులో నగదును జమ చేస్తూ వచ్చారు. ఇటీవల యువతి అతడికి బ్రేకప్ చెప్పింది. దీంతో నిబంధన ప్రకారం వారి అకౌంట్‌లో ఉన్న రూ.25,000లు మోసపోయిన యువకుడు తీసుకున్నాడు. దీనికి అతను HIF (Heartbreak Insurance) అని పేరు పెట్టాడు. ప్రస్తుతం ఇతడు పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అరే! ఈ విషయం తెలీక మేం.. చాలా డబ్బులు పోగొట్టుకున్నామే.. అని కొందరు, నీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: సింహాన్ని ఇలా కూడా ఫూల్ చేయొచ్చా.. ఇతడు చేసిన పనికి చివరకు ఏ జరిగిందో చూడండి..

Updated Date - 2023-03-23T15:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising