ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మోదీకి ఫోన్ చేసి మాట్లాడించనా..? బైక్‌ను ఆపేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందు రెచ్చిపోయిన మహిళ.. చివరకు..!

ABN, First Publish Date - 2023-09-27T21:18:35+05:30

పోలీసులు వాహనాలు తనిఖీ చేసే సమయంలో అప్పుడప్పుడూ ఫన్నీ సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. పోలీసుల ఎదుట కొందరు మందుబాబుల తీరు.. చూసేందుకు తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. ఇటీవల పలువురు యువతులు కూడా.. మేమేం తక్కువ కాదంటూ..

పోలీసులు వాహనాలు తనిఖీ చేసే సమయంలో అప్పుడప్పుడూ ఫన్నీ సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. పోలీసుల ఎదుట కొందరు మందుబాబుల తీరు.. చూసేందుకు తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. ఇటీవల పలువురు యువతులు కూడా.. మేమేం తక్కువ కాదంటూ ఓవర్ యాక్షన్ చేయడం కూడా చూస్తున్నాం. తాజాగా, ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బైకుపై వెళ్తున్న యువతిని ట్రాఫిక్ పోలీసులు నిలిపేశారు. దీంతో ఆగ్రహించిన ఆమె.. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడించనా.. అంటూ రెచ్చిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని (Mumbai) బాంద్రా-వర్లీ సీ లింక్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. జబల్‌పూర్ (Jabalpur) ప్రాంతానికి చెందిన నుపుర్ ముఖేష్ పటేల్ అనే యువతి (young woman) బుల్లెట్ బైక్‌పై దక్షిణ ముంబై వైపు ప్రయాణిస్తున్నట్లు బాంద్రా-వర్లీ సీ లింక్ సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ వెళ్లింది. దీంతో అప్రమత్తమైన వారు కాపు కాసి ఆమె రాగానే బండిని ఆపేశారు. పోలీసుల వాహనాన్ని ఆపగానే.. యువతి చిర్రెత్తుకొచ్చింది. నా బండినే ఆపుతారా అంటూ (young woman angry on the police) ఆగ్రహం వ్యక్తం చేసింది. నా బండిని తాకితే నరికేస్తా.. అంటూ తిట్లదండకం అందుకుంది. అంతటితో ఆగకుండా ‘‘మోదీకి (Prime Minister Narendra Modi) ఫోన్ చేసి మాట్లాడించమంటావా’’.. అని అనడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.

Wife-Husband: జీవితాంతం గుర్తుండే బర్త్‌డే గిఫ్ట్‌ను పంపిస్తున్నానన్న భర్త.. కొద్ది నిమిషాలకే మళ్లీ భార్యకు ఫోన్.. తీరా చూస్తే..!

బైక్ దిగేందుకు ఒప్పుకోని ఆమె.. ‘‘నరేంద్ర మోదీ ఫోన్ చేసి బైక్ ఆపమని చెబితే చేస్తా.. వెళ్లి మోదీకి ఫోన్ చేయండి’’ అని అనేసరికి పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికీ శాంతించని యువతి.. ‘‘ఈ రోడ్డు మా నాన్నది.. మేము ట్యాక్స్ కడుతున్నాం.. నన్ను ఎవరూ ఆపలేరు’’.. అంటూ నోటివి వచ్చినట్లు మాట్లాడేసింది. ఈ క్రమంలో అడ్డు వస్తున్న కానిస్టేబుల్‌ను పక్కకు నెట్టేసింది. పనికి ఆటంకం కలిగించడం, ర్యాష్ డ్రైవింగ్, ప్రాణహాని కలిగించడం, ప్రభుత్వోద్యోగిపై దాడి చేసినందుకు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బహుశా.. ఈమె బ్రెయిన్ దొబ్బిందేమో’’.. అంటూ కొందరు, ‘‘మందుబాబులను మించిన యాక్టింగ్’’.. అంటూ మరికొందరు, ‘‘ఈమె చాలా ఫన్నీగా ఉందే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Bride: వరుడి ఇంటికి చేరిన వధువు.. కాబోయే భర్తను మొదటిసారి చూసిన ఆమెకు షాక్.. పెళ్లిని ఎలాగైనా ఆపాలని పక్కా స్కెచ్..!

Updated Date - 2023-09-27T21:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising