ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime news: రోడ్డు పక్కన పొదల మధ్య బయటపడ్డ ఇనుప పెట్టె.. అందులో ఏముందా అని భయం భయంగా వెళ్లి తెరచి చూస్తే..

ABN, First Publish Date - 2023-09-03T21:16:35+05:30

అనుకోని సందర్భాల్లో అనుకోని ప్రదేశాల్లో అనుమానాస్పద వస్తువులు బయటపడడం తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు పురాతన వస్తువులు బయటపడితే.. మరికొన్నిసార్లు..

అనుకోని సందర్భాల్లో అనుకోని ప్రదేశాల్లో అనుమానాస్పద వస్తువులు బయటపడడం తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు పురాతన వస్తువులు బయటపడితే.. మరికొన్నిసార్లు మనుషుల పుర్రెలు, అస్తిపంజరాలు కూడా కనిపిస్తుంటాయి. ఇటీవల మనుషుల్లో నేర ప్రవృత్తి మరీ పెచ్చుమీరిపోతోంది. తమ దారికి రాని వారిని చంపడానికీ వెనుకాడడం లేదు. ఆ కేసుల నుంచి బయటపడేందుకు మరిన్ని నేరాలు చేస్తుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పొదల మధ్య ఓ ఇనుప పెట్టె కనిపించింది. గమనించిన స్థానికులు.. అందులో ఏముందా అని భయం భయంగా వెళ్లి తెరచి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) భదోహిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గోపీగంజ్ కొత్వాలి ప్రాంత పరిధి లాలానగర్‌‌లో వెలుగుచూసిన ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవల కొందరు స్థానికులు.. ఇక్కడి జాతీయ రహదారి పక్కన నిర్జన ప్రదేశంలో చెట్ల పొదల వద్ద సంచరిస్తుండగా వారికి ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. పొదల మధ్యలో పెద్ద ఇనుప పెట్టెను (iron box) చూసి అవాక్కయ్యారు. ఈ వార్త తెలియడంతో చుట్టుపక్కల వారంతా అక్కడ గుమికూడారు. అందులో ఏముందా అని భయం భయంగానే పెట్టెను ఓపెన్ చేశారు. తీరా అందులో సగం కాలిపోయిన ఓ యువతి మృతదేహం (young woman dead body) ఉండడం చూసి షాక్ అయ్యారు.

Viral Video: వామ్మో! ఇదెక్కడి డ్రైవింగ్‌రా బాబోయ్.. రోడ్డుపై ఎంత ట్రాఫిక్ ఉంటే మాత్రం.. ఏ ఆటో డ్రైవరైనా ఇలా చేస్తాడా..

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. చనిపోయిన యువతి వయసు సుమారు 20 ఏళ్లు ఉంటుంది. యువతి ముఖం పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఘటన సమాచారం అందుకున్న భాదోహి ఎస్పీ మీనాక్షి కాత్యాయన్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎవరో యువతిని హత్య చేసి, గుర్తుపట్టకుండా ఉండేలా కాల్చేసి పెట్టెలో పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా.. లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

Updated Date - 2023-09-03T21:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising