Viral Video: పార్సిల్ ఎంతకీ రాకపోవడంతో డెలివరీ బాయ్‌కి ఫోన్ చేసిన యువతి.. నంబర్ డయల్ చేయగానే.. ఏం జరిగిందో చూడండి..
ABN, First Publish Date - 2023-11-03T20:58:27+05:30
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చదువురాని వారు కూడా ఇంట్లో కూర్చునే సంపాదించుకునే సదుపాయం ఉంది. అలాగే ఎంత చదువుకున్న వారైనా కొన్నిసార్లు దారుణంగా మోసపోయే ప్రమాదం కూడా ఉంది. సైబర్ నేరాలపై ఎంత అవగాహన ఉన్నా.. నేరస్థులు ఎప్పటికప్పుడు...
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చదువురాని వారు కూడా ఇంట్లో కూర్చునే సంపాదించుకునే సదుపాయం ఉంది. అలాగే ఎంత చదువుకున్న వారైనా కొన్నిసార్లు దారుణంగా మోసపోయే ప్రమాదం కూడా ఉంది. సైబర్ నేరాలపై ఎంత అవగాహన ఉన్నా.. నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూ ఉంటాం. తాజాగా, ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. పార్సిల్ ఎంతకీ రాకపోవడంతో డెలివరీ బాయ్‌కి ఫోన్ చేసిన యువతి.. నంబర్ డయల్ చేయగానే.. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) తనకు కావాల్సిన వస్తువు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది. అయితే పార్సిల్ (Parcel) మాత్రం ఎంతకీ రాలేదు. దీంతో చివరకు సందేహం వచ్చి సదరు డెలివరీ సంస్థకు కాల్ చేసింది. ‘‘మా డెలివరీ బాయ్ మీ అడ్రస్ కోసం వెతుకుతున్నాడు.. కానీ చాలా కష్టంగా ఉంది.. వెంటనే అతడికి కాల్ చేయండి’’.. అని చెప్పి అతడి నంబర్ ఇచ్చారు. అయితే ఫోన్ నంబర్‌కు ముందు 401 నంబర్ డయల్ చేయమని సూచించారు. అయితే దీంతో ఆమెకు సందేహం కలిగింది.. కానీ అలా డయల్ చేస్తే ఏమవుతుందో చూద్దామని ప్రయత్నిస్తుంది.
వాళ్లు చెప్పిన విధంగా డయల్ చేయడంతో వెంటనే ఆమె కాల్ ఫార్వార్డ్ అవుతున్నట్లు సందేశం వచ్చింది. అలా చేయడం వల్ల ఫోన్‌లోని సమాచారం మొత్తం సైబర్ నేరస్థులకు చేరే ప్రమాదం ఉంది. ఇలా పార్సిల్ పేరుతో వారు చేసిన మోసాన్ని యువతి వివరించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇలాక్కూడా జరుగుతోందా’’.. అని కొందరు, ‘‘మోసాన్ని భలే పసిగట్టారు’’.. అని మరికొందరు, తమకు జరిగిన అనుభవాలను వివరిస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-11-03T20:59:04+05:30 IST