ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Birth Day Gift: ఈ యువతి పుట్టిన రోజుకు కలలో కూడా ఊహించని గిఫ్ట్.. కేక్ పక్కనే వాటిని పెట్టి మరీ సెలబ్రేషన్స్..!

ABN, First Publish Date - 2023-07-11T20:55:01+05:30

ప్రస్తుతం యువత ఏ వేడుకలు నిర్వహించినా.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంటారు. కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వైరల్ అవుతుంటే.. మరికొందరు సమాజానికి సందేశం ఇచ్చేలా వేడుకలు ప్లాన్ చేస్తూ.. అందరి దృష్టిలో పడుతున్నారు. ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం యువత ఏ వేడుకలు నిర్వహించినా.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంటారు. కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వైరల్ అవుతుంటే.. మరికొందరు సమాజానికి సందేశం ఇచ్చేలా వేడుకలు ప్లాన్ చేస్తూ.. అందరి దృష్టిలో పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ యువతి పుట్టిన రోజు వేడుకలకు.. బంధువులు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. దీంతో చివరకు సదరు యువతి వాటిని కేక్ పక్కనే ఉంచుకుని సెలబ్రేషన్స్ చేసుకుంది..

మహారాష్ట్రలోని (Maharashtra) థానే జిల్లా కళ్యాణ్‌లోని కొచ్చాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న సోనాల్ బోర్సే అనే యువతి (young woman) .. తన పుట్టిన రోజు వేడుకలను (Birthday celebrations) బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆదివారం ఘనంగా జరుపుకొంది. అయితే ఈ సందర్భంగా అంతా అవాక్కయ్యే సంఘటన చోసుకుంది. యువతి సోదరుడు, అత్త, మామ తదితరులు.. ఆమెను సర్‌ఫ్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఊహించని గిఫ్ట్ బాక్స్ తీసుకుని వచ్చారు. కేక్ కట్ చేసే ముందు యువతిని.. బాక్స్ తెరవమని చెప్పారు. గిఫ్ట్ బాక్స్ తెరచిన యువతి.. అందులో టమాటాలు (tomatoes) ఉండడం చూసి ఖంగుతింది.

Crocodiles vs Chicken: చుట్టూ వందల కొద్దీ మొసళ్లు.. మధ్యలో ఇరుక్కుపోయిన కోడి.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..!

చివరకు విషయం తెలుసుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. తర్వాత సుమారు 4కిలోల టామాలను కేక్ పక్కనే ఉంచి కట్ చేసింది. టమాటా ధర ఉన్నట్టుండి కేజీ రూ.140కి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, స్థానికంగా పండించే టమాటాలను నాసిక్, జున్నార్, పూణే నుంచి ముంబైకి సరఫరా అవుతుంటాయి. అయితే ఇటీవల తుఫాను కారణంగా టమోటా రైతులు నష్టపోయారు. ఇదిలావుండా, టమాటాలను పక్కన పెట్టుకుని.. పుట్టిన రోజు చేసుకున్న యువతి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. టమాటాలతో బర్త్‌డే.. సూపర్.. అంటూ యువతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Viral Video: వామ్మో.. ఇంత చిన్న చెప్పు కింద.. అంత పెద్ద పాము ఎలా దాక్కుందో మీరే చూడండి.. చూడకపోయి ఉంటే..!

Updated Date - 2023-07-11T20:59:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising