ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: అంతా చూస్తుండగానే.. కాలికి వేసుకున్న చెప్పులను తీసి.. ఓ యువకుడి చెంపలు వాయించిన యువతి.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2023-08-19T21:56:00+05:30

మహిళలు అటు ఇంటా, ఇటు బయటా.. నిత్యం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరు వారి సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. మరికొందరు తెగించి ముందుకొస్తుంటారు. కొందరు యువతులైతే తమకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా పోరాడుతుంటారు. తప్పు చేసిన ...

మహిళలు అటు ఇంటా, ఇటు బయటా.. నిత్యం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరు వారి సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. మరికొందరు తెగించి ముందుకొస్తుంటారు. కొందరు యువతులైతే తమకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా పోరాడుతుంటారు. తప్పు చేసిన వారిని అందరి ముందూ కడిగిపారేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అంతా చూస్తుండగా.. ఓ యువతి తన చెప్పు తీసుకుని యువకుడిని చెంపలు వాయించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) హాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతికి (young woman) విచిత్ర సమస్య వచ్చి పడింది. ఇటీవల ఆమెను ఓ వ్యక్తి ఫాలో అవుతూ ఉన్నాడు. మొదట్లో ఈమెకు ఎలాంటి డౌట్ రాలేదు. అయితే రోజూ ఆమె వెనుకే వెళ్తూ ఉండేవాడు. అంతటితో ఆగకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అయినా ఆమె ఎవరికీ చెప్పకుండా అలాగే భరిస్తూ వచ్చింది. దీంతో సదరు వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. రోజురోజుకూ ఎక్కువగా వేధిస్తుండడంతో (Harassment) చివరకు కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అంతా కలిసి గ్రామ పెద్దల సమక్షంలో సదరు వ్యక్తిని తీసుకొచ్చి పంచాయితీ పెట్టారు.

UPI Transactions: పర్సుల్లోంచి డబ్బులు తీయడం లేదా..? షాపుల్లో స్కాన్ చేసే ముందు వీటిని చెక్ చేసుకోకపోతే..!

వేధింపులకు పాల్పడినందుకు గాను.. పంచాయితీ పెద్దలు అతన్ని చెప్పుతో కొట్టమంటూ తీర్పు ఇచ్చారు. అందరి ఎదుటే ఆ యువతి తన కాలికి ఉన్న చెప్పు తీసి, ఆ వ్యక్తిని ఫెడేల్‌మంటూ కొట్టింది. ఇలా తన కోపం తగ్గేవరకూ అతన్ని బాదేసింది. దీంతో చివరకు అతను ఆమెకు దండం పెట్టి క్షమించమంటూ వేడుకున్నాడు. శిక్ష అనంతరం అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. కాగా, ఈ ఘనటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అతన్ని అంతటితో వదలకుండా పోలీసులకు పట్టించాల్సింది’’.. అని కొందరు, ‘‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా.. పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాల్సింది’’.. అని మరికొందరు, ‘‘బాగా బుద్ధి చెప్పారు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Shocking: మీ అమ్మాయిని పూడ్చి పెట్టిన చోట ఏవో వింత శబ్దాలు వస్తున్నాయని చెప్పిన కాటికాపరి.. అనుమానంతో తవ్వి చూస్తే..!

Updated Date - 2023-08-19T21:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising