పరిపక్వత లేదంటూ బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి రద్దు చేసుకున్న యువతి.. చివరకు ఆమె చేసుకున్న వ్యక్తిని చూసి అంతా షాక్..
ABN, First Publish Date - 2023-03-14T15:59:46+05:30
యువతులతో ప్రేమయాణం సాగించే యువకులు.. మొదట్లో ఎంతో ప్రేమను కనబరుస్తుంటారు. అయితే రాను రాను అదే ప్రేమ ఉంటుందని గ్యారంటీ ఉండదు. కొందరైతే ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నా.. వివాహానంతరం భార్యను వేధిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో..
యువతులతో ప్రేమయాణం సాగించే యువకులు.. మొదట్లో ఎంతో ప్రేమను కనబరుస్తుంటారు. అయితే రాను రాను అదే ప్రేమ ఉంటుందని గ్యారంటీ ఉండదు. కొందరైతే ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నా.. వివాహానంతరం భార్యను వేధిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో మహిళలు ఊహించని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. పరిపక్వత లేదంటూ చివరి నిముషంలో ప్రియుడితో వివాహాన్ని రద్దు చేసుకుంది. చివరకు ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తిని చూసి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని (America) నార్త్ కరోలినాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అమండా కానన్ అనే యువతి (young woman).. కళాశాలలలో చదువుతున్న సమయంలో తోటి స్నేహితుడిని (Love with a friend) ప్రేమించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలని నిర్ణయంచుకున్నారు. ఈ క్రమంలో 2017లో వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ మంచి ముహూర్థం చూసుకుని పెళ్లి (marriage) ఫిక్స్ చేసుకున్నారు. అయితే తీరా చివరి నిముషంలో అమాండా... నాకీ పెళ్లి ఇష్టం లేదంటూ (rejection) తిరస్కరించింది. దీంతో ఆమె బాయ్‌ఫ్రెండ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తర్వాత కొన్నేళ్ల పాటు ఒంటరిగానే జీవించిన అమాండా జీవితంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది.
Viral Video: మహిళ ముందు విన్యాసం చేయాలని చూశాడు.. చివరకు కాలు చూసుకుని ఖంగుతిన్నాడు..
54 ఏళ్ల ఏస్ అనే వ్యక్తి అప్పటికే భార్యకు విడాకులు (Divorce) ఇచ్చి ఒంటరిగా ఉండేవాడు. అతడికి అప్పటికే ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇలావుండగా, ఏస్‌తో అమాండాకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకరి నంబర్లు ఒకరు మార్చుకున్నారు. రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో అమాండా సంచలన నిర్ణయం తీసుకుంది. తన తండ్రి వయసున్న ఏస్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని అతడికి చెప్పడంతో ముందు కొంచెం ఆలోచించాడు. ఇద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉండడంతో తటపటాయించిన ఏస్.. చివరకు ఆమెను వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. చివరకు ఇలా వారిద్దరూ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
త్వరలో అమాండా తల్లి కూడా కాబోతోంది. ఏస్‌ను పెళ్లి చేసుకోవడంపై అమాండా మాట్లాడుతూ.. యువకులకు పరిపక్వత ఉండదని, మధ్యలోనే భార్యలను విడిచిపెడతారని చెప్పింది. తనకంటే ఏస్ చాలా పెద్దవాడైనా బాధ్యతలు తెలిసినవాడని తెలిపింది. కొత్తవారు తమను చూస్తే.. తండ్రీకూతుళ్లు అనుకుంటూ ఉంటారని, అయినా అవేవీ తాను పట్టంచుకోనని.. తన జీవితం ఎంతో సంతోషంగా సాగుతోందని ఆమె చెబుతోంది. కాగా, ఈ జంటకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral photos) అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ జంట గురించి నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Updated Date - 2023-03-14T15:59:46+05:30 IST