ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాగా దగ్గు వస్తోందంటూ క్లినిక్‌కు వెళ్లిన 21 ఏళ్ల యువతి.. ఇంజెక్షన్ చేయగానే నీలి రంగులోకి మారిన శరీరం.. చివరకు..

ABN, First Publish Date - 2023-02-08T18:37:12+05:30

చిన్న చిన్న సమస్యలకు వైద్యుల వద్దకు వెళ్లి.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకునే ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. హర్యానాలో ఇటీవల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న చిన్న సమస్యలకు వైద్యుల వద్దకు వెళ్లి.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకునే ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. హర్యానాలో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బాగా దగ్గు వస్తోందంటూ 21ఏళ్ల యువతి.. స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌కు వెళ్లింది. వైద్యుడు ఇంజెక్షన్ వేయగానే.. యువతి శరీరం నీలి రంగులోకి మారింది. చివరకు ఏం జరిగిందంటే..

హర్యానాలోని (Haryana) కర్నాల్‌ పరిధి తారావాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన తిషా(21) అనే యువతి (young woman).. బీఏ చివరి సంవత్సరం చదువుతోంది. ఇటీవల యువతి దగ్గుతో బాగా ఇబ్బంది పడుతోంది. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గకపోవడంతో ఇటీవల ఓ రోజు స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యుడు చివరకు యువతికి కొన్ని ఇంజెక్షన్లు (Cough injections) వేశాడు. అయితే అవి వేసిన కాసేపటికి ఆమె శరీరం నీలి రంగులోకి మారింది. ఏం కాదని వైద్యుడు సర్దిచెప్పడంతో ఇంటికి వెళ్లింది. అయితే గంటలు గడిచే కొద్దీ ఆమె ఆరోగ్యం క్షీణించడం (illness) మొదలైంది. చూస్తుండగానే కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు అంతా కలిసి సదరు క్లినిక్‌ని (Clinic) ముట్టడించారు.

మూడేళ్ల కూతుర్ని చంపి ఓ తల్లి ఆత్మహత్య.. ఆమె పొట్టకు ప్లాస్టర్‌తో అంటించి ఉందో కాగితం.. పోలీసులు ఓపెన్ చేసి చూస్తే..

వైద్యుడు జ్ఞాన్ అక్రమంగా క్లినిక్ నడుపుతున్నాడని స్థానికులు ఆరోపించారు. వీరి ఆందోళనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. నకిలీ వైద్యుడి (fake doctor) కారణంగానే తమ కూతురు చనిపోయిందని, వెంటనే సదరు వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. వైద్యుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

భార్య కట్నం అందకపోవడంతో.. స్నేహితులను ఇంటికి తీసుకెళ్లిన భర్త.. చివరకు తల్లితో కలిసి చేసిన నిర్వాకం తెలిస్తే..

Updated Date - 2023-02-08T18:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising