ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఒకే బైక్‌పై ముగ్గురు అమ్మాయిలు.. పోలీస్ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నలకు.. ఈ యువతుల రెస్పాన్స్ వింటే..!

ABN, First Publish Date - 2023-09-07T15:43:53+05:30

పోలీసుల పేరు వింటేనే చాలా మంది తెగ భయపడిపోతుంటారు. ఎక్కడ.. లేని పోని ప్రశ్నలు అడిగి.. ఉన్నదీ, లేనిదీ చెప్పి.. కొట్టడమో లేదా ఏ కేసులోనైనా ఇరికిస్తారేమో అని ఆందోళన చెందుతుంటారు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. పోలీసులంతా అలాగే ఉండరు. కొందరు..

పోలీసుల పేరు వింటేనే చాలా మంది తెగ భయపడిపోతుంటారు. ఎక్కడ.. లేని పోని ప్రశ్నలు అడిగి.. ఉన్నదీ, లేనిదీ చెప్పి.. కొట్టడమో లేదా ఏ కేసులోనైనా ఇరికిస్తారేమో అని ఆందోళన చెందుతుంటారు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. పోలీసులంతా అలాగే ఉండరు. కొందరు ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సాటి వారిపై మానవత్వం కూడా ప్రదర్శిస్తుంటారు. ఇంకొందరు.. తప్పు చేసిన వారికి చిన్న పిల్లలకు చెప్పినట్లుగా ఓపికగా వివరిస్తుంటారు. ఇలాంటి పోలీసులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఒకే బైక్‍‌పై ముగ్గురు అమ్మాయిలు వెళ్లడం చూసి ఓ కానిస్టేబుల్ బండిని ఆపేస్తాడు. సదరు పోలీసు అడిగిన ప్రశ్నలకు ఆ యువతులు ఇచ్చిన సమాధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పోలీసు కానిస్టేబుల్ బైకుపై వెళ్తుండగా.. దారి మధ్యలో ఆయనకు ముగ్గురు యువతులు కలిసి (Threeyoung women on one bike) ఒకే బైకుపై వెళ్లడం కనిపిస్తుంది. దీంతో వారితో బండి రోడ్డు పక్కన ఆపమంటూ ఎంతో సున్నితంగా చెబుతాడు. పోలీసును చూడగానే యువతులు కూడా మొదట భయపడి బండిని వెంటనే రోడ్డు పక్క నిలిపేస్తారు. బైకు రోడ్డు పక్కన ఆపి వారి వద్దకు వెళ్లిన పోలీసు.. ఒకే ముగ్గురు వెళ్లడంతో పాటూ కనీసం హెల్మెట్ (Helmet) కూడా లేకుండా వెళ్లడం తప్పు కదా.. అంటూ నవ్వుతూ ప్రశ్నిస్తాడు. దీంతో బైకు నడుపుతున్న యువతి వెంటనే సమాధానం ఇస్తుంది. ‘‘మా వద్ద హెల్మెట్ లేదు.. మీ హెల్మెట్ ఇస్తే.. మళ్లీ తిరిగి ఇచ్చేస్తాం’’.. అని అంటుంది.

Viral Video: నీటిలో ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. పెద్ద పెద్ద చేపలు పడుంటాయని పైకి ఎత్తి విప్పి చూడగా.. చివరికి షాకింగ్ దృశ్యం..

ఆమె సమాధానంతో అవాక్కైన పోలీసులు నవ్వుకుంటాడు. ‘‘అవునా.. అయితే రూ.15,00 డబ్బులు ఇస్తే హెల్మెట్ ఇస్తా’’.. అని తిరిగి వారితో అంటాడు. బైకుపై వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, అలాగే ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించవద్దు.. అంటూ సున్నితంగా చెప్తాడు. ‘‘నీ వెనుక ఉన్న ఇద్దరిలో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు’’.. అని కానిస్టేబుల్ అడగడంతో.. ‘‘ముగ్గురూ నా బెస్ట్ ఫ్రెండ్సే’’.. అని యువతి సమాధానం ఇస్తుంది. ‘‘అలా కుదరదు.. చివర్లో ఉన్న యువతి కాస్త తక్కువ బెస్ట్ ఉన్నట్టుంది.. కాబట్టి ఇందులో ఇద్దరే ప్రయాణించాలి’’.. అంటూ నవ్వుతూ నచ్చచెబుతాడు. తమ పట్ల పోలీసు వ్యవహరించిన తీరు చూసి.. యువతులు కూడా.. ‘‘ఇంకెప్పుడు తప్పు చేయం’’.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసు కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Metro Train: రద్దీగా ఉన్న మెట్రో రైల్లో ప్రేమ జంట రొమాన్స్.. ఓ ఆంటీకి చిర్రెత్తుకొచ్చి ఏం చేసిందో మీరే చూడండి..!

Updated Date - 2023-09-07T15:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising