ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime News: వామ్మో.. ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారా..? రూ.500 ఇవ్వలేదని ఏకంగా ప్రాణాలే తీసేశారు..!

ABN, First Publish Date - 2023-11-14T20:45:01+05:30

కొందరు స్నేహం కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడారు. అలాగే మరికొందరు అవసరమైతే ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీయడానికీ వెనుకాడరు. ఇంకొందరైతే శాడిస్టుల్లా మారి చిన్న చిన్న కారణాలకూ అత్యాచారాలు, హత్యలకూ తెగబడుతుంటారు. ఇలాంటి...

ప్రతీకాత్మక చిత్రం

కొందరు స్నేహం కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడారు. అలాగే మరికొందరు అవసరమైతే ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీయడానికీ వెనుకాడరు. ఇంకొందరైతే శాడిస్టుల్లా మారి చిన్న చిన్న కారణాలకూ అత్యాచారాలు, హత్యలకూ తెగబడుతుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి దారుణమే జరిగింది. మంది పార్టీ చేసుకునేందుకు రూ.500 ఇవ్వలేదనే కోపంతో కొందరు యువకులు తమ స్నేహితుడినే చంపేశారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బులంద్‌షహర్‌లోని కొత్వాలి దేహత్ ప్రాంత పరిధి తాజ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజారామ్ కుమారుడు బంటీ అనే యువకుడు ఉపాధి నిమిత్తం ఢిల్లీకి (Delhi) వెళ్లి పండ్ల వ్యాపారం చేస్తుండేవాడు. అయితే దీపావళి (Diwali) పండుగను పురస్కరించుకుని ఆదివారం సొంతూరికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత అతను ఊరికి రావడంతో స్నేహితులంతా కలవడానికి వచ్చారు. ఈ క్రమంలో కొందరు మందు పార్టీ (liquor party) ఇవ్వాలంటూ బంటీని కోరారు. అయితే ఆ సమయంలో పార్టీ ఇచ్చేందుకు బంటీ ఒప్పుకోలేదు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం మొదలైంది.

Marriage Video: కారులో రావాల్సిన వరుడిని సడన్‌గా ఇలా చూసి అవాక్కైన బంధువులు.. పెళ్లికి ముందే ముచ్చట తీర్చుకున్నాడుగా..!

కనీసం మందు కోసం రూ.500 ఇవ్వాలంటూ అంతా అతన్ని బలవంతపెట్టారు. డబ్బులు ఇచ్చేందుకూ బంటి నిరాకరించడంతో స్నేహితుల కోపం కట్టలు తెంచుకుంది. పరుష పదజాలంతో అతన్ని దూషించారు. దీంతో వారిపై బంటి కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి రెచ్చిపోయిన స్నేహితులు.. బంటిపై కత్తితో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బంటి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి మామ ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఆరుగురు యువకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral News: పెంపుడు కుక్క ప్రసవించిందని ఊరంతా భోజనాలు పెట్టించిన యజమాని.. మేళతాళాలు.. బ్యాండ్ బాజాలతో డాన్సులు..!

Updated Date - 2023-11-14T20:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising