Viral Video: ఈ వీడియో చూస్తే ఇకపై.. గోబీ మంచూరియా తినాలంటే కొద్దిగా ఆలోచిస్తారేమో..
ABN, First Publish Date - 2023-10-08T21:34:00+05:30
గోబీమంచూరియా అనగానే పిల్లలతో పాటూ పెద్దలకూ నోరూరుతుంది. పల్లెల నుంచి నగరాల వరకూ చాలా మంది గోబీని ఇష్టంగా తినడం చూస్తూ ఉంటాం. అయితే ఇష్టమైన ఆహారాన్ని ఎలా తయారు చేస్తారనే విషయంపై ప్రతి ఒక్కరికీ చాలా సందేహాలుంటాయి. అయితే...
గోబీమంచూరియా అనగానే పిల్లలతో పాటూ పెద్దలకూ నోరూరుతుంది. పల్లెల నుంచి నగరాల వరకూ చాలా మంది గోబీని ఇష్టంగా తినడం చూస్తూ ఉంటాం. అయితే ఇష్టమైన ఆహారాన్ని ఎలా తయారు చేస్తారనే విషయంపై ప్రతి ఒక్కరికీ చాలా సందేహాలుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో ఇలాంటి సందేహాలను వెంటనే నివృత్తి చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఆహార పదార్థాలను తయారు చేసే క్రమంలో శుభ్రత పాటించకపోవడం వంటి ఘటనలు కూడా తరచూ వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా, గోబీ మంచూరియా తయారీ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘‘ఇకపై గోబీ తినాలంటే కొద్దిగా ఆలోచించాలేమో’’.. అని కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు.. 500కేజీల గోబీ మంచూరియా (Gobi Manchuria making) చేసే పనిలో నిమగ్నమై ఉంటారు. ముందుగా వారు పెద్ద సంఖ్యలో క్యాబీజీని తీసుకుని వరుసగా కూర్చుని తరుగుతారు. ఇక్కడ వారు ఎలాంటి (uncleanliness) శుభ్రత చర్యలూ తీసుకోరు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాబేజీని పెద్ద ఇనుప పాత్రల్లో పోస్తారు. తర్వాత అందులో ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్ పిండితో పాటూ వివిధ రకాల మసాలా దినుసులను కలిపి నీళ్లు పోసి మెత్తగా కలిపేస్తారు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్‌గా దాన్ని చిన్న చిన్న వుండలుగా చేసి కాగుతున్న నూనెలో వేస్తారు.
ఇలా చివరకు వేడి వేడి గోబీమంచూరియాను సిద్ధం చేస్తారు. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. దీని తయారీలో వారు మొదటి నుంచీ వీరు చేతులకు గ్లౌజులు కానీ, తలకు క్యాప్ కానీ.. ఇలా ఏవీ ధరించకుండానే తయారీకి సిద్ధమవుతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇది చాలా స్పెషల్ గోబీలా ఉందే’’.. అని కొందరు, ‘‘వామ్మో! ఇకపై గోబీ తినాలంటే కొంచెం ఆలోచించాల్సిందే’’.. అని మరికొందరు, ‘‘ఏ వంట చేసినా శుభ్రత పాటించడం ముఖ్యం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-10-08T21:34:00+05:30 IST