ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Zomato: 'మిస్టర్ కార్తీక్ ఎంటిది.. గుత్తాధిపత్యం వద్దు'.. జొమాటో ట్వీట్ వైరల్..!

ABN, First Publish Date - 2023-09-14T13:28:14+05:30

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) తాజాగా చేసిన ఒక ట్వీట్ (Tweet) ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ కస్టమర్‌కు జొమాటో స్వీట్ వార్నింగ్ ఇవ్వడం ఆ ట్వీట్‌లో ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) తాజాగా చేసిన ఒక ట్వీట్ (Tweet) ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ కస్టమర్‌కు జొమాటో స్వీట్ వార్నింగ్ ఇవ్వడం ఆ ట్వీట్‌లో ఉంది. "ఇది జొమాటో.. ఇక్కడ గుత్తాధిపత్యానికి చోటులేదు" అనే లైన్ ట్వీట్‌లో ఉంది. దాంతో జొమాటో చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అసలేం జరిగిందంటే.. తమిళనాడు రాజధాని చెన్నై (Bhopal) కి చెందిన కార్తీక్ అనే యువకుడు తన పేరిట ఒకటికాదు రెండుకాదు ఏకంగా 139 చిరునామాలను సేవ్ చేసి పెట్టాడు. అది గమనించిన జొమాటో నిర్వాహకులు అతనికి తాజాగా ఓ ట్వీట్ చేశారు. "చెన్నై వాసి కార్తీక్ దయచేసి మీరు సేవ్ చేసిన 139 చిరునామాలలో కొన్నింటిని తొలగించండి. ఇది జొమాటో, గుత్తాధిపత్యం కాదు" అని ట్వీట్ చేసింది.

ఇదిలాఉంటే.. ఇంతకుముందు కూడా ఒకసారి ఓ మహిళా కస్టమర్ విషయమై జొమాటో చేసిన ఓ ట్వీట్ కూడా బాగా వైరల్ అయింది. "అంకిత ప్లీజ్ స్టాప్ సెండింగ్ ఫుడ్ టు యువర్ ఎక్స్" అంటూ జొమాటో చేసిన ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేసింది. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌ (Bhopal) కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ లవర్‌కు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ (Food Order) చేసింది. ఆమె పెట్టిన ఫుడ్ ఆర్డర్‌లో 'క్యాష్ ఆన్ డెలివరీ' (Cash on Delivery) ఆప్షన్‌ను ఎంచుకుంది. తీరా ఆమె ఇచ్చిన అడ్రస్‌కు ఫుడ్ తీసుకుని వెళ్లిన డెలివరీ బాయ్‌లకు చేదు అనుభవం ఎదురయ్యేది.

ఆ ఫుడ్ అక్కడకి వెళ్లాక ఆ మాజీ ప్రియుడు డబ్బులు ఇవ్వకుండా, ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయడం చేసేవాడు. ఇలా మూడుసార్లు జరిగింది. దాంతో ఇక లాభం లేదనుకున్న జొమాటో.. అంకితకు నేరుగా ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టింది. "భోపాల్‌కు చెందిన అంకిత దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ పంపించడం ఆపివేయండి. అతను డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడం ఇది మూడోసారి" అని ట్వీట్ చేసింది. అంతే.. ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది.

Innovative Awareness: రోడ్డు మీద రూ.500 నోటు ఉన్న పర్సు.. ఆశతో తీసుకుందామనుకుంటే మాత్రం అంతే సంగతులు.. వైరల్ వీడియో


Updated Date - 2023-09-14T13:28:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising