Zomato: 'ప్లీజ్.. ఇకపై అలా చేయకమ్మా.. ఆపేయ్'.. ట్విట్టర్‌లో యువతికి జొమాటో రిక్వెస్ట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!
ABN, First Publish Date - 2023-08-04T12:32:57+05:30
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఓ ట్వీట్ (Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కస్టమర్‌కు జొమాటో రిక్వెస్ట్ చేయడం మనం ఆ ట్వీట్‌లో చూడొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఓ ట్వీట్ (Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కస్టమర్‌కు జొమాటో రిక్వెస్ట్ చేయడం మనం ఆ ట్వీట్‌లో చూడొచ్చు. "అంకిత ప్లీజ్ స్టాప్ సెండింగ్ ఫుడ్ టు యువర్ ఎక్స్" అనే లైన్ ట్వీట్‌లో ఉంది. దాంతో జొమాటో చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్ (Bhopal) కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ లవర్‌కు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ (Food Order) చేసింది. ఆమె పెట్టిన ఫుడ్ ఆర్డర్‌లో 'క్యాష్ ఆన్ డెలివరీ' (Cash on Delivery) ఆప్షన్‌ను ఎంచుకుంది. తీరా ఆమె ఇచ్చిన అడ్రస్‌కు ఫుడ్ తీసుకుని వెళ్లిన డెలివరీ బాయ్‌లకు చేదు అనుభవం ఎదురయ్యేది.
ఆ ఫుడ్ అక్కడకి వెళ్లాక ఆ మాజీ ప్రియుడు డబ్బులు ఇవ్వకుండా, ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయడం చేసేవాడు. ఇలా మూడుసార్లు జరిగింది. దాంతో ఇక లాభం లేదనుకున్న జొమాటో.. అంకితకు నేరుగా ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టింది. "భోపాల్‌కు చెందిన అంకిత దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ పంపించడం ఆపివేయండి. అతను డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడం ఇది మూడోసారి" అని ట్వీట్ చేసింది. అంతే.. ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు (Netizens) ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'జొమాటో ఇది ఏమాత్రం బాగొలేదు. ఆమెకు కొంచె టైం ఇవ్వండి', "ఫర్వాలేదు, జొమాటో.. 'డెలివర్ ఎ స్లాప్' అనే కొత్త సర్వీస్‌ను ప్రారంభించండి. ఇది కచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను" అని మరోకరు కామెంట్ చేశారు. ఇక ఈ నెల 2వ తేదీన జొమాటో చేసిన ఈ ట్వీట్ ఇప్పటివరకు 1మిలియన్ వ్యూస్, 13వేలకు పైగా లైక్స్ సాధించింది.
Cab driver extorts: క్యాబ్‌లో వెళ్తున్నారా? ఇలాంటి వారుంటారు జాగ్రత్త సుమీ..!
Updated Date - 2023-08-04T12:36:32+05:30 IST