ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI: అరుదైన మైలురాయిని చేరుకోనున్న భారత్ vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్

ABN, First Publish Date - 2023-07-09T13:51:28+05:30

వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు (India tour of West Indies 2023) 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నెల నుంచి 12 నుంచి 16 మధ్య జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ డొమినికా వేదికగా జరగనుంది. ఇక 20 నుంచి 24 మధ్య ట్రినిడాడ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు (India tour of West Indies 2023) 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నెల 12 నుంచి 16 మధ్య జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ డొమినికా వేదికగా జరగనుంది. ఇక 20 నుంచి 24 మధ్య ట్రినిడాడ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్నాయి. అయితే ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌తో భారత్, వెస్టిండీస్ (West Indies vs India) జట్ల మధ్య 100 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. అంటే సెంచరీ పూర్తి కానుంది. దీంతో రెండు జట్లకు ఇది అరుదైన మైలురాయిగా నిలవనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ఇప్పటివరకు 98 టెస్ట్ మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ 30 మ్యాచ్‌ల్లో గెలవగా.. భారత జట్టు 22 మ్యాచ్‌ల్లో గెలిచింది. 46 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. విండీస్‌తో 2002 నుంచి భారత జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం.


కాగా భారత జట్టు 100 టెస్ట్ మ్యాచ్‌లాడిన మూడో టీంగా వెస్టిండీస్ నిలవనుంది. వెస్టిండీస్‌ కంటే ముందు భారత జట్టు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో కూడా 100 టెస్ట్ మ్యాచ్‌ల చొప్పున ఆడింది. భారత జట్టు ఇప్పటివరకు అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లను ఇంగ్లండ్‌తో (England) ఆడింది. ఆ జట్టుతో ఏకంగా 131 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో (Australia) 107 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. మొత్తంగా ఇప్పటివరకు అన్ని జట్లతో కలిపి 570 టెస్ట్ మ్యాచ్‌లాడిన టీమిండియా 172 మ్యాచ్‌ల్లో గెలిచింది. 176 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 221 టెస్ట్ మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. టెస్ట్ ఫార్మాట్లో భారత విజయాల శాతం 30.17గా ఉంది. ఓటముల శాతం 30.87 కాగా.. డ్రా గా ముగిసిన మ్యాచ్‌ల శాతం 38.77గా ఉంది.

Updated Date - 2023-07-09T13:54:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising